అమ్మో అమ్మాయి ,తమ్ముడిని బుట్టలో వేసుకొని ప్రియుడిని చంపించింది..

    0
    928

    అమ్మాయిలు స్పీడ్ అయిపోయారు..అక్రమసంబంధాల్లో వావివరసలు మర్చిపోతున్నారు.. ఒకరుకాదు ఇద్దరితో సంబంధాలు ,చివరకు మర్దర్లు .. వరంగల్లో జరిగిన దారుణమే ఇందుకు నిదర్శనం. యామిని అనే అమ్మాయి విజయ్ అనే యువకుడిని ప్రేమించి శారీకసంబంధం పెట్టుకుంది.. మళ్ళీ విజయ్ స్నేహితుడు , తన చిన్నాన్న కొడుకు అయిన రాంకీతోనూ ప్రేమలోపడి శారీరక సంబంధం పెట్టుకుంది. విజయ్ , రాంకీ ఇద్దరూ స్నేహితులే.. స్నేహితులిద్దరితో అక్రమసంబంధం కొంతకాలం గుట్టుగానే సాగించింది. వరుసకు తమ్ముడిని పెళ్ళిచేసుకుంటే ఒప్పుకోరని , విజయ్ ని పెళ్ళికి పోరుచేసింది . అయితే అక్కాతమ్ముళ్ల సంబంధంపై అనుమానంతో విజయ్ , యామినిని పెళ్లాడేందుకు ఒప్పుకోలేదు. అక్రమసంబంధం కొనసాగింపుకు ప్రపోజ్ చేశాడు. దీంతో వ్యవహారం బెడిసింది. విజయ్ , యామినితో తాను కలిసి ఉన్న ఫొటోలను స్నేహితులకు పంపాడు. దీంతో యామిని , రాంకీతోకలిసి విజయ్ ని చంపాలని ప్లాన్ చేసింది. యామిని ప్లాన్ ప్రకారం విజయ్ ని , రాంకీ తన ఇంటికి పిలిచాడు. కారులో కాసేపు తిరిగిన తరువాత , గీసుకొండ కాకతీయ కెనాల్ వద్ద కారు ఆపి కిందకు దిగారు. అకస్మాత్తుగా విజయ్ పై రాంకీ దాడిచేసి , కాలువలోకి తోసి చంపేశాడు . కేసు విచారణలో నేరం రుజువుకావడంతో పోలీసులు రాంకీని , యామినిని అరెస్టుచేశారు..