తారల తళుకుబెళుకులు వెనుక చీకట్లకు కన్నడ తార జయశ్రీ ఆత్మహత్య ఉదాహరణ.

    0
    296

    కొంతమంది సినిమా తారల తళుకుబెళుకులు జీవితం వెనుక ఆవహించుకున్న చీకట్లకు కన్నడ తార జయశ్రీ ఆత్మహత్య ఒక ఉదాహరణ. నిన్నటిరోజున బెంగుళూరులో తన ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్ కు ఉరివేసుకుని ఉండగా ఈ రోజు కనుక్కొని పోలీసులు శవాన్ని ఆసుపత్రికి తరలించారు. కన్నడ సినీతారగా , మోడలింగ్ రంగంలోనూ ఆమె ఒక వెలుగువెలిగింది. కర్ణాటకలో బిగ్ బాస్ -3 కంటెస్టెంట్ గా ప్రాచుర్యం పొందింది. ఇదివరకే రెండు దఫాలు ఆమె సోషల్ మీడియా వేదికగా తాను ఈ పాడులోకాన్ని వదిలి వెళ్తానని చెప్పింది. అప్పట్లో స్నేహితులు ఆమెకు నచ్చజెప్పారు. మానసిక సంఘర్షణనుంచి బయటపడటం తనవల్ల కావడంలేదంటూ పలు దఫాలు సోషల్ మీడియాలో బాధ పడేది. తన సమస్య ఆర్దికమైంది కాదని , డబ్బుకు తనకు ఇబ్బందిలేదని , వ్యక్తిగత సమస్యలే వెంటాడుతున్నాయంటూ బాధపడేది. ఇటీవలకాలంలో తరచూ ఫొన్ నంబర్లు మారుస్తూ ఫ్రెండ్స్ కి కూడా అందుబాటులోలేకుండాపోయింది. ఇప్పుడు సడెన్ గా ఆమె ఆత్మహత్య వార్త అభిమానులను కలచివేసింది.