లేడీ ఎస్సైకే లైంగిక వేధింపులు – తట్టుకోలేక ఆత్మహత్య ..

    0
    1724

    లైంగిక వేధింపులు భరించలేక ఒక మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకుంది. ఇది నమ్మశక్యంకాని నిజం. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ సహార్ జిల్లాలో అర్జూ పవర్ అనే 30 ఏళ్ళ యువతి ఎస్సైగా పనిచేస్తోంది. 2015లో ఆమె పోలీసు శాఖలో నియామకం అయింది. ప్రస్తుతం అనూప్ సహర్ పోలీసు స్టేషన్లో పనిచేస్తోంది. గత రాత్రి ఇంటి యజమానులు ఫోన్ చేయడంతో బదులివ్వలేదు. దీంతో తలుపు తట్టి చూసినా బదులులేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలుపులు పగలకొట్టి చూశారు. ఫ్యాన్ కు వేలాడుతూ ఉన్న ఎస్సై మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నా చావుకు ఎవరూ కారణంకాదు , నేనే కారణం అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఇదిలా ఉండగా మహిళా ఎస్సైని ఒక ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ చాలాకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని చెబుతున్నారు. ఆమెతో కలిసి ఉన్నప్పటి ఫొటోలను చూపి బెదిరిస్తున్నాడని తెలుస్తోంది. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తేలింది. ఇటీవలకూడా ఆమెకు ఒక ఎంఎంఎస్ పంపాడని తేలింది. అప్పటినుంచి అర్జూ ముభావంగా ఉందని , ఆమె ఆత్మహత్యకు కారణం ఇదేనని చెబుతున్నారు..