యాక్సిడెంట్లు ఆపే ట్యాగ్.. కుర్రాడి ఐడియా అదుర్స్..

    0
    1318

    చిమ్మ చీకటిలో బైక్ పై వెళ్తుంటే.. కుక్క రోడ్డుకి అడ్డంగా వస్తే ఏమవుతుంది, వాహనం అదుపు తప్పి యాక్సిడెంట్ కావడం గ్యారెంటీ. హైవేల పక్కన బర్రెలు, గేదెలు, ఆవులు.. ఇలా చాలా పశువులు యాక్సిడెంట్లకు గురి కావడం కూడా చూస్తూనే ఉంటాం. అలాంటి పశువుల్ని దూరంగానే గమనిస్తే వాహనం వేగాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరిగే ఛాన్స్ లు తక్కువగా ఉంటాయి.

    ఫ్లోరోసెంట్ ట్యాగ్..

    ఆవులు లేదా ఇతర పశువుల కళ్లు వాహనాల కాంతికి మెరుస్తుంటాయి. సహజసిద్ధంగా ప్రమాదాల బారిన పడకుండా వాటికి ఆ రక్షణ ఉంది. అయితే అన్ని సందర్భాల్లో పశువుల కళ్లలో లైటింగ్ పడటం, అది రిఫ్లెక్ట్ అయి మనకు కనిపించడం అరుదు. రేడియం స్టిక్కర్లు కొంతవరకు ఈ ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఓ ఉద్యమంగా చేపట్టారు గుండ్లూరి చైతన్య అనే యువకుడు.

    http://bizinnings.com/ChaitanyaGundluri.php

    వీధి కుక్కలు, ఆవుల మెడలో ఫ్లోరోసెంట్ ట్యాగ్ లు కట్టి వాటిని ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతున్నాడు. మంచి ఉద్యోగం, సొంత వ్యాపారాలు, ఆస్తులు ఉన్నా కూడా.. తన సమయంలో ఎక్కువభాగం ఇలా సమాజ సేవకే కేటాయిస్తున్నాడు చైతన్య. అందరిలా కాకుండా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తాడు.

    ఎలా వచ్చిందీ ఐడియా..?

    చైతన్య ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అతని ఫ్రెండ్ బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. సడన్ గా బైక్ కి కుక్క అడ్డు రావడంతో తప్పించే క్రమంలో చైత్య ఫ్రెండ్ చనిపోయాడు. కుక్క మాత్రం బతికిపోయింది. ఆ సంఘటన నుంచే చైతన్యలో ఆలోచన మొదలైంది. తన ఫ్రెండ్ కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదనే ఉద్దేశంతో ఈ ఫ్లోరోసెంట్ ట్యాగ్ లను తయారు చేయించాడు. రోడ్డుపై ఉండే కుక్కలు, ఆవులకి తానే వెళ్లి స్వయంగా కట్టి వచ్చేవాడు.

    కుక్కలంటే చైతన్యకు అభిమానం ఎక్కువ, అంతేకాదు పర్యావరణం అంటే బాగా ఇష్టం. వీకెండ్ అయితే చాలు నేచర్ కి దగ్గరగా వెళ్లిపోతాడు. తనతోపాటు ఇలాంటి ఆసక్తి, అభిరుచులు ఉన్న స్నేహితుల్ని కలుపుకొని వెళ్లడం చైతన్యకు అలవాటు. హిల్ ఏరియాలకు వెళ్లడం, ట్రెక్కింగ్ పై ప్రత్యేక ఆసక్తి ఉంది. చైతన్య.. మూగజీవాల పట్ల కూడా ప్రేమ చూపిస్తాడు. లైఫ్ ని సింపుల్ గా గడిపేయడం కంటే.. ఓ గుర్తింపు తెచ్చుకోవడం, పదిమందికి ఉపయోగపడటమే తన జీవిత లక్ష్యం అంటాడు చైతన్య.

    కాలర్ అప్..

    ఆవులకు, వీధి కుక్కలకు ఇలా ఫ్లోరెసెంట్ ట్యాగ్ లు కట్టే కార్యక్రమాన్ని కాలర్ అప్ అనే పేరుతో మొదలు పెట్టాడు గుండ్లూరి చైతన్య. సోషల్ మీడియాలో దీన్ని ఓ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాడు. ఎవరైన తనను సంప్రదిస్తే.. తన సొంత ఖర్చుతో ట్యాగ్ లు పంపిస్తాడు.

    తనలాగే మూగ జీవాల పట్ల ప్రేమ చూపే వారికి అండగా నిలుస్తాడు. సొంతగా వెబ్ సైట్ రూపకల్పన చేసి.. ఎప్పటికప్పుడు ఎక్కడ, ఏయే జీవాలకు ట్యాగ్ లు కట్టారనే విషయాలు పొందు పరుస్తారు.

    https://collarup.in/

    కాలర్ అప్ అనే పేరుతో ఫేస్ బుక్ పేజీని రూపొందించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన వారి వివరాలను కూడా పొందు పరుస్తున్నారు. 130మంది వాలంటీర్లు కాలర్ అప్ సంస్థకోసం పనిచేస్తున్నారు.

    https://www.facebook.com/collarupngo

    32 నగరాల్లో వీరంతా కాలర్ అప్ కోసం పశువులకు ట్యాగ్ లు కట్టారు. ఇప్పటి వరకు 2వేల కుక్కలకు, 160 ఆవులు, ఎద్దులకు ఇలా ఫ్లోరెసెంట్ ట్యాగ్ లు అమర్చారు.

    ఇవి కూడా చదవండి:

    https://ndnnews.in/treatmentforteerasma-1852-2/

    https://ndnnews.in/valentinesdaycheating947-2/