ప్రేమ ప్రకృతి సహజం దానికి పోక్సో చట్టం ఎందుకు.. ?

    0
    527

    యవ్వనంలోఉన్న యువతీయువకుల ప్రేమ వ్యవహారాలనుకూడా పోక్సో చట్టం పరిధిలోకి తీసుకురావడం మంచిదికాదని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. చెన్నైలో 20 ఏళ్లలోపు వయసున్న ఆటో డ్రైవర్ , ఒక మైనర్ అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఇద్దరూ లేచిపోయారు. అమ్మాయితరపు బంధువులు పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో , వాళ్ళను తీసుకొచ్చి , అబ్బాయిపై పోక్సో చట్టంకింద కేసుపెట్టారు. దీనిపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ వెంకటేష్ ఒక కేసు విషయమై అర్ధవంతమైన వ్యాఖ్యలు చేశారు. పోక్సో చట్టం ఉద్దేశం మైనర్ బాలికలపై లైంగిక నేరాలు అరికట్టేందుకు ఉద్దేశించిందని అన్నారు. వయసులో ఉన్నవారు , హార్మోన్ల ప్రభావంవల్ల , శరీరంలో సహజంగా జరిగే మార్పులవల్ల ప్రేమభావనలు కలిగి , పరస్పర ఆకర్షణకు లోనై చేసే వ్యహారాలను , పెద్దలు గమనించి సరిదిద్దుకోవాలని లేదా వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలని , అంతేతప్ప పోక్సో లాంటి చట్టాలను వాళ్లమీద ప్రయోగించి , భవిష్యత్తులో వారిని దారిమళ్ళేట్టు చేయడం మంచిదికాదన్నారు. ఈ కేసులో తానే ప్రియుడిని , తనను లేపుకుపోయి పెళ్లిచేసుకోమని వత్తిడి చేసినట్టు అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంటును పోలీసు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించింది. ప్రతిదాంట్లో అబ్బాయిలనే నేరస్తులుగా చూసే వైఖరి మంచిదికాదని అన్నారు. యవ్వనంలో ప్రకృతి సహజంగా మొలకెత్తే ప్రేమభావనలకు కౌన్సిలింగ్ , సమాజం దృక్పధం మారాలేతప్ప , కఠినమైన చట్టాలతో యవ్వనంవల్ల కలిగే మార్పులను నియంత్రిచలేమని స్ఫష్టంచేశారు. చట్టసభలుకూడా పోక్సో చట్టం ఇలా దుర్వినియోగంకాకుండా సవరణలు చెయ్యాలని కోరారు.