మదనపల్లిలో కూతుళ్ళ హత్యాకాండ వెనుక కన్నీటి కధలు- తరతరాల శాపం

    0
    1521

    మదనపల్లిలో కూతుళ్ళ హత్యాకాండ వెనుక కన్నీటి కధలున్నాయి..మూఢ భక్తి వెనుక తరతరాల శాపం వెంటాడుతొంది..కూతుళ్ళ హత్యకేసులో తల్లితండ్రులను విచారిస్తున్న మానసిక డాక్టర్లకే కన్నీరుపెట్టే పరిస్థితి. వాస్తవమేమిటో తెలిశాక గుండె బరువెక్కే దీనస్థితి . కూతుళ్ళ హత్యకేసులో తల్లి పద్మజ కుటుంబంలో మతిచాంచల్యం వంశపారంపర్యంగా వస్తోంది. ఆమె తండ్రికి , మేనమామకు , ఆమెకు , ఆమె కూతురు అలేఖ్యకు ఈ జబ్బు వంశపారంపర్యంగా వస్తోంది. ఇంత దారుణానికి ఇదేకారణమైంది. పురుషోత్తంనాయుడుకికూడా మతిచాంచల్యం ఉందని తేలింది. మానసిక సమస్య ఆ కుటుంబానికి వారసత్వంగా వస్తోందని డాక్టర్లు నిర్థారించారు. అందువల్ల వారిని విడిగా ఉంచి చికిత్స అందించాలని సూచించారని తెలిసింది. కూతురు అలేఖ్య తాను శివుడి అవతారమని , ఆడ రూపంలో భువికి అవతరించానని చెప్పేది. మిరపకాయలు , నిమ్మకాయలు వేసిన ముగ్గు తొక్కిన తరువాత తనకు దెయ్యం పట్టిందని తాను చనిపోతానని సాయిదివ్య కేకలు వేస్తుంటే , నువ్వు చనిపోతే నేను బ్రతికిస్తానంటూ అలేఖ్య చెప్పిందని చెబుతున్నారు. ఇంతకుముందుకూడా తాను చనిపోయిన ఒక కుక్కను బ్రతికించానని చెప్పేదని తెలిసింది. తమను చంపండి అంటూ కూతుళ్లు వత్తిడి తెచ్చినప్పుడు , తల్లితండ్రులు మొదట ఒప్పుకోలేదని తెలిసింది. అయితే దెయ్యం పోవాలంటే తానూ చనిపోవాలని , తరువాత తనుకూడా చనిపోయి ఇద్దరం బతికివస్తామని చెప్పేవాళ్లని తేలింది. ప్రస్తుతం వీరిని విశాఖలోని మానసిక వైద్యశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. కూతురు అలేఖ్య చనిపోయిన తరువాత తాను కాళికనంటూ తల్లి , కూతురు నాలుక కోసి తిన్నదని కూడా చెబుతున్నారు.