మన దేశంలో కొంతమంది పెళ్లికూతుళ్లకంటే ఈ పెళ్లికూతురు చాలా మేలు..

    0
    1288

    మన దేశంలో కొంతమంది పెళ్లికూతుళ్లకంటే ఈ పెళ్లికూతురు చాలా మేలు.. తాళి కట్టేముందు పీటలమీదనుంచి లేచిపోవడమో , తాళి విసిరి కొట్టడమో , తన లవర్ వస్తాడని వెయిట్ చేయమని పెళ్లికొడుక్కి చెప్పడంలాంటి నీచమైన పనులు చేయలేదు.. లేదా శోభనం రోజుకు లవర్ తో లేచిపోలేదు..ఇలాంటివి ఇటీవల మనదేశంలో చాలా జరిగాయి. చాలా హుందాగా ప్రవర్తించింది. పెళ్లికొచ్చిన తన మాజీ ప్రియుడు కింద కూర్చుని ఉంటే పైకి పిలిచింది. అతడు తన మాజీ ప్రియుడని చెప్పింది. ఇద్దరి అభిప్రాయాలు కలవక గౌరవంగా విడిపోయాయని చెప్పింది. పెళ్ళితంతు అయిపోయిన తరువాత తన మాజీ ప్రియుడిని పైకి పిలుస్తానని చెప్పింది. అతడు సరేనన్నాడు. పెళ్లి పూర్తి అయిన తరువాత పైకొచ్చిన మాజీప్రియుడిని ఒక్కసారి కౌగలించుకుంటానని పర్మిషన్ అడిగింది. పెళ్ళికొడుకు విశాల హృదయంతో ఓకే చెప్పేశాడు. దీంతో పెళ్లివేదికపైనే మాజీప్రియుడికి హగ్ ఇచ్చేసింది. తరువాత మాజీప్రియుడు కూడా , పెళ్ళికొడుకుని కౌగలించుకొని శుభాకాంక్షలు చెప్పాడు.. జకార్తాలో జరిగిందీ ఘటన.