బాయ్ ఫ్రెండ్ లేకపోతే కాలేజీకి రావద్దు.. 14 వతేది అతడుకూడా రావాలి..

    0
    1004

    బాయ్ ఫ్రెంఢ్ లేకుండా కాలేజీకి రావద్దు .. వస్తే నో ఎంట్రీ అంటూ 150 ఏళ్ళ చరిత్ర ఉన్న కాలేజిపేరుతో వచ్చిన సర్క్యులర్ పై తీవ్ర దుమారం రేగింది. ఫిబ్రవరి 14 వతేది వాలెన్ టిన్ రోజుకు ప్రతి అమ్మాయి కాలేజీకి వచ్చి బాయ్ ఫ్రెండ్ ను చూపించాలని లేకపోతే బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటో అయినా చూపించాలంటూ ఆగ్రాలోని సెయింట్ జాన్స్ అకడమిక్ డైరెక్టర్ సింగ్ పేరుతొ ఈ సర్క్యులర్ వచ్చింది. అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉంటే సెక్యూరిటీ ఉంటుందని పేర్కొన్నారు. కనీసం ఒక బాయ్ ఫ్రెండ్ కంపల్సరీ అని కండిషన్ పెట్టారు. సోషల్ మీడియాలో ఇది విస్తృతంగా ప్రచారకూడా అయింది. దీంతో పెద్ద దుమారమే రేగింది. అమ్మాయిల తల్లితండ్రులు కాలేజీకి ఫోన్లు చేసి తిట్లు అందుకున్నారు. మరికొంతమంది నేరుగా కాలేజీకి వచ్చి గోడవ వేసుకున్నారు. చివరకు విచారణలో ఇదెవరో ఆకతాయిలు చేసిన పని అని తేల్చారు. దేశంలోనే ప్రతిష్టాత్మమైన కాలేజీల్లో ఇదికూడా ఒకటి. తమ కాలేజీని అప్రదిష్టపాలు చేసేందుకు , ఫేక్ సర్క్యులర్ ప్రచారంచేశారని ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. త్వరలోనే భాద్యులను గుర్తించామని పోలీసులకు సమాచారం ఇచ్చామని అన్నారు..