రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.

    0
    105
    రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం…
    =================
    తిరుమ‌ల శ్రీనివాసుడుకి ఈరోజు హుండీ క‌లెక్ష‌న్ల‌లో రికార్డు సృష్టించింది. ఈ ఒక్క‌రోజులేనే స్వామివారికి హుండీ క‌లెక్ష‌న్ల ద్వారా 5 కోట్ల 21 ల‌క్ష‌లు విరాళం వ‌చ్చింది. తిరుమ‌ల యాత్ర‌కు కొన్ని ఆంక్ష‌లు ఉన్న‌ప్ప‌టికీ ఇంత‌టి రికార్డు స్థాయిలో హుండీలో కానుక‌లు ప‌డ‌డం విశేషం. 2012 ఏప్రిల్ 1న అత్య‌ధికంగా 5 కోట్ల 73ల‌క్ష‌లు విరాళం వ‌చ్చింది. దాదాపు 9 ఏళ్ళ త‌ర్వాత గురువారం నాడు 5 కోట్ల 21 ల‌క్ష‌ల రూపాయ‌లు స్వామివారి హుండీలో కానుక‌లు వ‌చ్చి ప‌డ్డాయి.