శశికళకు సీరియస్.. రజనీ పరార్.. కమల్ ఢమాల్ .. తమిళ రాజకీయం ఎటు .. ?

    0
    876

    జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించింది. ఆమె కరోనాతోపాటు , ఊపిరితిత్తులు , మధుమేహం , రక్తపోటు , మూత్రాశయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆమెను బెంగుళూరు విక్టోరియా హాస్పిటల్లో ఐసియులో ఉంచి చికిత్స చేస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నా , చికిత్సకు స్పందిస్తున్నారని డాక్టర్లు చెప్పారు. జీవితంలో ఎత్తుపల్లాలకు శశికళ నిలువెత్తు నిదర్శనం. జయలలిత ఇంట్లో పనిమనిషిగా చేరి , తన టక్కుటమార విద్యలతో జయలలిత స్థాయికి ఎదిగింది. ఒక రకంగా జయలలిత రాజకీయానికి , ఆస్తులకు వారసురాలిని అన్నంతగా పట్టుసాధించింది. తనకంటూ కట్టుబట్టలతో జయలలిత పంచనచేరినా , వేలకోట్లరూపాయల ఆస్తులకు యజమానురాలైంది. విధి వక్రించి జయలలిత మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కేంద్రం నమ్మకం కోల్పోయి , ముఖ్యమంత్రి సీటుకు దూరమైంది. తరువాత ఉప ఎన్నికల్లో తన అభ్యర్థి సత్తా చాటినా , ఆ తరువాత జైలు పాలైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోర్టు విధించిన 10 కోట్ల రూపాయల ఫైన్ కట్టి , ఏడాదిముందే విడుదలకు సిద్దమయింది. ఇక మరికొన్ని రోజుల్లో శశికళ విడుదల కానుండగా , ఆమె తీవ్ర అస్వస్థతకు లోనయింది. దీంతో రాబోయే తమిళనాడు ఎన్నికల్లో శశికళ ప్రభావం తమిళనాడు రాజకీయాల్లో యెంత అన్న విషయం ప్రస్నార్ధకం అయింది. ఒక వైపు లేస్తే మనిషిని కాదు ..అంటూ డంబాలు పలికిన రజనీకాంత్ , నాటకీయరీతిలో తనకు ఆరోగ్యం బాగాలేదంటూ తమిళ రాజకీయతెరనుంచి తప్పుకున్నాడు. ఆయన సినీస్టైల్లోనే , తమిళ రాజకీయాలనుంచి తప్పుకున్నట్టు కనిపిస్తుంది. అభిమానులను మొదట రెచ్చగొట్టి , ఆ తరువాత అనారోగ్యం డ్రామా ఆడి తప్పుకున్నట్టు అనుమానాలున్నాయి. దీంతో తమిళనాడులో ఫైట్ డీఎంకే , అన్నాడీఎంకే మధ్యనే ఉండిపోయింది. కమలహాసన్ పార్టీ , ఏపీలో జనసేనమాదిరే ఉంది. ఈ పరిస్థితుల్లో శశికళ రంగప్రవేశంచేసివుంటే , అన్నాడీఎంకే ఓట్లలోనే చీలిక వచ్చి డీఎంకే లాభపడి ఉండేది. రజనీకాంత్ అభిమానులుకూడా ఎక్కువగా డీఎంకే వైపే మొగ్గుచూపుతున్నారు.