మహా ముదురుపిల్ల. పోలీసులనే ముప్పతిప్పలు పెట్టింది. సిటీనే గడగడ లాడించింది.

    0
    941

    ఆ అమ్మాయికి 19 ఏళ్ళు..
    డిగ్రీ మొదటి ఏడాది చదువుతుంది. చిన్న వయసులోనే రాటు తేలిపోయింది. మహా ముదురుపిల్ల. పోలీసులనే ముప్పతిప్పలు పెట్టింది. ఇండోర్ సిటీనే గడగడ లాడించింది. తనను ఐదుగురు యువకులు కిడ్నాప్ చేశారని, ఆ తరువాత దారుణంగా తనపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని చెప్పింది. కత్తులతో తనను పొడిచి , రేప్ చేశారని తెలిపింది. ఆ తరువాత తాను స్పృహలో లేని పరిస్తితిలో గోనె సంచిలో మూటకట్టి రైల్వే లైన్ పై వేసేసారని చెప్పింది. ఎలాగో తాను బయటపడ్డానని తెలిపింది. పోలీసులు వెంటనే అమ్మాయిని హాస్పిటల్ కి పంపి దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాయి చెప్పిన మార్గంలో 112 సిసి కెమెరాలు పరిశీలించారు. హాస్పిటల్లో డాక్టర్ల రిపోర్టులో అనుమానం మొలకెత్తింది. కత్తి గాయాలు అమ్మాయే స్వయంగా చేసుకున్నట్టు అనుమానం ఉందని చెప్పారు. రేప్ జరిగిన ఆనవాళ్లు కూడా లేవని అన్నారు. పోలీసులకూ సిసి కెమెరాలనుంచి ఆధారాలు ఏమీ లభించలేదు. ఆ అమ్మాయి ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన నిందితుడు, అమ్మాయి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. దీంతో అమ్మాయి సినిమాను తలదన్నే క్రైమ్ సీన్ అల్లింది.. దీంతో పోలీసులు అమ్మాయిపై కేసు నమోదు చేశారు…