ఫేస్ బుక్ పరిచయంతో అడ్డంగా బుక్కయ్యాడు..

    0
    324

    ఎమ్మార్వో కార్యాలయం ఉద్యోగిని ఫేస్ బుక్ నిండా ముంచేసింది. ఏకంగా 10లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఆ ప్రబుద్ధుడు. లండన్ మహిళ పేరుతో పరిచయం చేసుకున్న ఆవిడతో రోజూ ఛాటింగ్ చేయడానికి అలవాటు పడ్డ ఆ ఉద్యోగి చివరకు 10లక్షలు సమర్పించుకున్నాడు.

    అసలేం జరిగిందంటే..?
    ఖమ్మం జిల్లా కారేపల్లి ఎమ్మార్వో ఆపీస్ లో సీనియర్ అసిస్టెంట్‎గా పనిచేస్తున్న సుధీర్ కి, నెల రోజుల క్రితం రోస్లీ నికోలస్ అనే లండన్ మహిళ ఫేస్‎బుక్‎ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. దాన్ని యాక్సెప్ట్ చేసిన సుదీర్.. అప్పటి నుంచి ఆమెతో ఫేస్‎ బుక్‎ లో చాటింగ్ చేసేవాడు. కొద్ది రోజుల క్రితం కవితా శర్మ అనే మరో మహిళ లైన్లోకి వచ్చింది. రోస్లీ నికోలస్‌ 50 వేల డాలర్లు పంపించారని, తాను కస్టమ్స్‌ అధికారినంటూ కవితా శర్మ, సుధీర్ తో పరిచయం పెంచుకుంది. కొత్త రోజులుగా వీరి మధ్య చాటింగ్ పెరిగింది. ఈ క్రమంలో సుధీర్ దగ్గర కవితా శర్మ 10 లక్షల 72 వేల 500 రూపాయలు ఆన్ లైన్ ద్వారా వసూలు చేసింది. అటు డాలర్లు కూడా రాకపోవడంతో సుధీర్ తాను మోసపోయానని అనుకున్నాడు. తనకు డాలర్లు వద్దని, తన డబ్బులు తిరిగిచ్చేస్తే చాలన్నాడు. అక్కడితో కవితా శర్మ ఫోన్ కట్ చేసింది.

    దీంతో ఆమె చేతిలో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సుధీర్ పోలీస్ స్టేషన్ ‎కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..