బంగాళాదుంప కేజీ 5 రూపాయలు.. ఎక్కడో తెలుసా..?

    0
    239

    బంగాళా దుంప రేట్లు భారీగా పడిపోయాయి. కేజీ రూ.5 నుంచి రూ.6 మధ్యలో రేటు పలుకుతోంది. అయితే వినియోగదారుల విషయానికొచ్చే సరికి రేటు భారీగా పెరిగిపోతోంది. రిటైల్ ధర కేజీ 30వరకు ఉంటోంది.

    శీతాకాలంలో వేసిన పంట దిగుబడి భారీగా ఉండటంతో రేట్లు కూడా భారీగా పడిపోయాయని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ఉల్లగడ్డల రేటు సగానికి సగం పడిపోయింది. వినియోగదారులకు ఇది సంతోషకరమైన విషయమే అయినా.. రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు. పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    అన్ని ప్రాంతాల్లో కాదు..
    ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, బీహార్‌ రాష్ట్రాల్లో 60 ప్రధాన ప్రాంతాల్లో రేట్లు భారీగా పడిపోయాయి.
    గతేడాది ఇదే సమయంలో ఉత్తర్ ‌ప్రదేశ్‌ లోని కొన్ని జిల్లాల్లో బంగాళాదుంపల టోకు ధరలు కిలో రూ.8-9 మధ్య ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కిలో ధర రూ.10-23 వరకు పలికింది.
    ఈ ఏడాది చెన్నైలో గరిష్ఠంగా రూ.17 ఉన్నట్లు ఆహార తయారీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఢిల్లీలో రిటైల్‌ ధర గత శుక్రవారం కిలో రూ.15 కాగా, ఏడాది క్రితం ఇదే రోజున కిలో రూ.30గా నమోదైంది.

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..