ఫేక్ అకౌంట్లతో ఇబ్బంది పడుతున్న మెగా హీరో..

  0
  353

  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ యువహీరోకి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఎక్కువయ్యాయి. అసలా హీరోకి ఒరిజినల్ అకౌంట్ లేదు. ఆయనెవరో కాదు, ఇటీవలే ఉప్పెనతో హిట్ కొట్టిన పంజా వైష్ణవ్ తేజ్. అయితే వైష్ణవ్ పేరుతో కొంతమంది ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్ట్ లు పెట్టడం ప్రారంభించారు. వైష్ణవ్ అఫీషియల్ అకౌంట్ అని చెప్పడంతో అభిమానులంతా దాన్నే ఫాలో అయ్యారు. తక్కువ టైమ్ లోనే 14వేలమంది ఫాలో అవుతున్నారు.

  అయితే ఇటీవల ఈ అకౌంట్లో కొన్ని ట్వీట్లు అభ్యంతరకరంగా ఉండటంతో సదరు హీరో దృష్టికి తీసుకెళ్లారు అభిమానులు. అసలా ట్విట్టర్ అకౌంట్ తనది కాదని, దాన్ని ఎవరూ ఫాలో కావద్దని చెప్పారు హీరో వైష్ణవ తేజ్. ఈ మేరకు తాజాగా వైష్ణవ్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘నేను ట్విటర్‌లో భాగం కాదు. అందులో నాకు ఎలాంటి అకౌంట్ లేదు. ఫేక్‌ ట్విటర్‌ ఖాతాలను ఫాలో కావొద్దని అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే, అలాంటి ఖాతాల గురించి రిపోర్ట్‌ చేయాలని కోరుతున్నాను. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను.’’ అని వైష్ణవ్‌ పేర్కొన్నారు.

  ‘ఉప్పెన’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌ కు మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్‌ లభించింది. యువతలో ఆయనకు ఫాలోయింగ్‌ మొదలైంది. దీంతో ఆయనకు సంబంధించిన అన్నిరకాల సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించే వారి సంఖ్య పెరిగింది.

  ఇవీ చదవండి

  క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..