ఎర్రచీమల చట్నీపై హైకోర్టులో పిటిషన్..

    0
    210

    ఎర్రచీమల చట్నీతో ఉపయోగం ఏంటి? అసలు దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? వైద్య పరమైన సుగుణాలు దానిలో ఉన్నాయా లేదా? కరోనా వైరస్ ని ఎదుర్కొనే శక్తి దానికి ఉందా..? వీటన్నిటిపై సీఎస్ఐఆర్ ప్రయోగాలు చేయాలని, ఆమేరకు సదరు సంస్థను ఆదేశించాలంటూ ఒడిశాకు చెందిన నయాంతర్ పొదియాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఒడిశా, చత్తీస్ ఘడ్ లోని గిరిజన ప్రాంతాల్లో పచ్చి మిరపకాయలు, ఎర్ర చీమలు కలిపి చట్నీ చేస్తారు. గిరిజనులు ఎక్కువగా దీన్ని వాడతారు. ప్లూ, దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలు, నీరసం రకరకాల జబ్బుల్లో మందుగా దీన్ని వాడతారు. ఇప్పటికీ చాలామంది గిరిజనులు అల్లోపతి మెడిసిన్ వాడకుండా దీన్నే విరుగుడుగా వాడుతుంటారు.

    ఇన్ని రుజువులు ఉన్నా కూడా దీన్ని సీఎస్ఐఆర్ ఎందుకు పరిగణించడంలేదని ప్రశ్నిస్తున్నారు నయాంతర్ పొదియాల్. రామ్ దేవ్ బాబా లాంటి వారు చేసే మోసాలకు సీఎస్ఐఆర్ పరిశోధనలు అండగా నిలుస్తుంటాయని, అలాంటిది గిరిజనుల ప్రాచీన వైద్యంపై ఎందుకు పరిశోధనలు చేయకూడదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా వ్యాధికి ఎర్రచీమల చట్నీ పనిచేస్తుందో లేదో కూడా తేల్చాలని కోరారు.

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..