ప్రేమ మైకంలో పోజులిస్తారు- బెడిసికొడితే??

  0
  1355

  ప్రేమలో పడ్డ వాళ్లకు కళ్లు కనపడవు , ప్రేమ మైకంలో వళ్ళు తెలియదు , మైమరిచిపోతారు.. ఆ మైకంలో ఏమిచేస్తారో తెలియదు. కలిసి ఫొటోలు దిగుతారు. సెల్ఫీలు తీసుకుంటారు. బట్టలు విప్పి ఆన్ లైన్లో ప్రియుడికి చూపిస్తారు. రహస్యంగా కలిసినప్పుడు , దాన్నీ వీడియో తీసుకుంటారు. తర్వాత  పోజులిస్తారు. చివరకు ప్రేమ బెడిసికొడితే , అవన్నీ సోషల్ మీడియాకు ఎక్కుతాయి. లేదంటే బ్లాక్ మెయిల్ మొదలై చివరకు , జీవితాలనో , సంసారాలనో కూలదోసే పరిస్థితి వస్తుంది. ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు ఎదురైనా , అమ్మాయిలకు , అబ్బాయిలకూ బుద్దిరావడంలేదు .. అలాంటిదే ఈ సంఘటన

  ఇప్పుడిది హైదరాబాద్ హైకోర్టులో ఉంది. నగరానికే చెందిన ఓ అమ్మాయి చదువుకునే సమయంలో ప్రియుడికి నగ్నంగా ఫోజులిచ్చింది. తర్వాత ప్రేమపెటాకులైంది . అమ్మాయి పెళ్లిచేసుకొని విదేశాలకు వెళ్ళిపోయింది. భర్త , పిల్లలతో సంసారం చేసుకుంటుంది . ఇటీవల అమ్మాయి గతంలో తీసుకున్న నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. అమ్మాయి తల్లితండ్రులు , గూగుల్ , ఇంస్టా , లకు ఫిర్యాదుచేశారు. దాన్ని తీసేశారు . అయితే మళ్ళీ ఇటీవల ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో అమ్మాయి తల్లితండ్రులు హైదరాబాద్ లో హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రేమికుడేమో తాను ఆ ఫొటోలు పెట్టలేదని హైకోర్టుకు చెబుతున్నాడు. గతంలో పెట్టిన ఫొటోలు ఎవరైనా డౌన్ లోడ్ చేసుకొని మళ్ళీ సోషల్ మీడియాలో పెడుతున్నారన్న,అనుమానంకూడా ఉంది. దీంతో హైకోర్టు గూగుల్ , ఫేస్ బుక్ , ఇంస్టా తదితర ప్లాట్ ఫామ్ లకు నోటీసులివ్వాలని ఆదేశించింది.

   

  ఇవీ చదవండి

  క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..