ఆ మంత్రి వారానికొక ప్రియురాలి ఇంట్లో..

  0
  2560

  తన ఉంపుడుగత్తె , సినీ నటి అయిన అర్పిత ఇంట్లో 29 కోట్లు లంచాల డబ్బు దాచి చిక్కి పోయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్ధ ఛటర్జీ గురించి అర్పిత బోలెడన్ని ఆసక్తికర విశేషాలు చెప్పింది. ప్రస్తుతం మంత్రి పార్ధ ఛటర్జీ , అర్పితా ఇద్దరూ , ఈడీ అధికారులు అదుపులో ఉన్నారు. మంత్రి పార్ధ , తన ఇంటికి వారానికొకసారి వచ్చేవారని చెప్పింది. తన ఇంట్లో దొరికింది ఆయన డబ్బేనని ఒప్పుకుంది. అది టీచర్ల నియామక స్కాం లో లంచాల డబ్బు అనికూడా చెప్పింది. వారానికొకసారి వచ్చి , తన ఇంట్లోకాసేపు ఉండి , డబ్బులున్న గదిని చూసుకొని వెళ్లేవారని తెలిపింది.

  తనలాగే మరో మహిళకూడా , పార్ధ తో ఇలాంటి సంబంధమేఉందని , ఆమె ఇంట్లోకూడా ఇలాగే డబ్బులు దాచిపెట్టాడని చెప్పింది. అర్పిత గతంలో నాటకాల రాణి.. డాన్సర్. అంతేకాదు ఫేస్ బుక్ లో పెద్ద ఫేమస్ .. సోషల్ మీడియా పరిచయంతో అర్పిత , మంత్రి ఛటర్జీకి దగ్గరైంది. తరువాత మంత్రి పక్కనే సభలలో కనిపించేది. ఆ తరువాత మంత్రి ఛటర్జీనే , ఆమె ఇంట్లో కనిపించడం మొదలైంది. అంతే , ఇక మంత్రి ఇంటికన్నా , ఆమె ఇంటికే సందర్శకుల తాకిడి మొదలైంది. ఆ విధంగా అర్పిత , ఏస్థాయికి ఎదిగిందీ అంటే , ఏకంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ , ఆమెను పొగిడేంత స్థాయికి ఎదిగింది.

  బెంగాలీ, ఒడియా, తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ ఆమె నటించారు. బెంగాలీలో ఒకటి రెండు పెద్ద చిత్రాల్లోనూ ఆమె కనిపించారు. ఆమె ఫేస్‌బుక్‌ బయోలో మల్టీ టాలెంటెడ్‌ అని ఉంది. పార్థా ఛటర్జీ నిర్వహించే దుర్గా పూజల కమిటీ ‘నాట్కల ఉదయన్‌ సంఘ’కు ఆమె ప్రచారకర్తగానూ వ్యవహరించారు. కోల్‌కతాలో భారీగా దుర్గా పూజలు నిర్వహించే కమిటీ ఇది. ఇప్పుడు అర్పిత ఇంట్లో బస్తాల్లో పట్టక , గదిలో పోగేసిన నోట్లకట్టలు 29 కోట్లు కనిపించడంతో సంచలనమైంది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.