పట్టుకుంటే ఇలా.జిప్పు తీస్తే అలా.

    0
    2275

    చిన్న‌పిల్ల‌ల‌ను డ్రెస్ మీద తాకితే ఫోక్సో చ‌ట్టం వ‌ర్తించ‌ద‌ని, బ‌ట్ట‌లు విప్ప‌కుండా చిన్న‌పిల్ల‌ల‌పై చేసే అత్యాచారాలు లైంగిక వేధింపుల కింద‌కే వ‌స్తాయ‌ని, స్కిన్ టు స్కిన్ ట‌చ్ కానిదే ఫోక్సో యాక్ట్ కింద కేసు బుక్ చేసేందుకు వీలు లేద‌ని ఆమె ఇచ్చిన రూలింగ్ ఓ సంచ‌ల‌నం. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కే ప్యాంట్ జిప్ తీసి ఉన్నంత మాత్రాన అది లైగింక నేరం కాద‌ని, లైంగిక వేధింపు మాత్ర‌మే అని, దాన్ని కూడా ఫోక్సో యాక్ట్ కింద కేసు బుక్ చేయ‌లేమ‌ని మ‌రో సంచ‌ల‌న తీర్పు. మైన‌ర్ పిల్ల‌ల‌ను బ‌ట్ట‌ల‌పై తాకినంద మాత్రాన అది లైంగిక నేరం కింద‌కి రాదు… ఇలా సంచ‌ల‌న‌మైన వ్యాఖ్య‌లు చేసింది నాగ‌పూర్ డివిజ‌న్ బెంచ్ జ‌డ్జి పుష్ప గ‌నేదివాలా అనే మ‌హిళా న్యాయ‌మూర్తి. మ‌హిళ‌గా వుండి ఆమె దేశంలో మైన‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారాల‌ను అరిక‌ట్టే ఫోక్సో చ‌ట్టానికి కొత్త నిర్వ‌చ‌నాన్ని చెప్పి వివాదాస్ప‌ద‌మైంది.

    39ఏళ్ళ వ్య‌క్తి 12ఏళ్ళ మైన‌ర్ బాలిక‌ను దుస్తులు ఉండ‌గానే ప‌ట్టుకున్నాడ‌ని అందువ‌ల్ల స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదు కాబ‌ట్టి, అది లైంగిక నేరం కాకుండా లైంగిక వేధింపు మాత్ర‌మేనంటూ దీనికి ఫోక్సో చ‌ట్టం వ‌ర్తింప చేయ‌లేమంటూ తీర్పు ఇచ్చింది. అయితే ఫోక్సో చ‌ట్టం ప్ర‌కారం సెక్స్ కోరిక‌ల‌తో లేదా సెక్స్ భావ‌న‌తో మైన‌ర్ల‌ మ‌ర్మాంగాల‌ను గానీ, ఛాతీ భాగాన్ని గానీ తాకినా లేదా ఆ పిల్ల‌ల చేత తాకించినా అది లైంగిక నేరం కింద‌కే వ‌స్తుంది. అయితే ఇలాంటి నేరాల్లో స్కిన్ టు స్కిన్ ట‌చ్ ఉండాల‌ని, అది లేదు కాబ‌ట్టి ఫోక్సో యాక్ట్ కింద దీన్ని ప‌రిగ‌ణించ‌లేమ‌ని ఆమె తీర్పు ఇచ్చింది.

    ఈ తీర్పుల‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా, ఓ మ‌హిళా న్యాయమూర్తిగా ఉండా ఆమె ఇచ్చిన ఫోక్సో చ‌ట్టానికి ఆందోళ‌న క‌లిగించేలా ఉంది. ఫోక్సో చ‌ట్టంపై నాగ‌పూర్ బెంచ్ న్యాయ‌మూర్తి పుష్ప చేసిన వ్యాఖ్య‌లు ఒక ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల‌కు దారి తీస్తాయ‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ కే.కే.వేణుగోపాల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మైన‌ర్ బాలిక చేతులు ప‌ట్టుకుని ప్యాంట్ జిప్ ఓపెన్ చేయించ‌డం ఫోక్సో చ‌ట్టం కింద‌కు రాదంటూ ఆమె ఇచ్చిన తీర్పు వివాదాస్ప‌ద‌మైంది. 50 ఏళ్ళ వ్య‌క్తి 5 ఏళ్ళ మైన‌ర్ బాలిక విష‌యంలో అలా చేయ‌డంపై దాఖ‌లైన క్రిమిన‌ల్ అప్పీల్ పై జ‌రిగిన విచార‌ణ‌లో మ‌హిళా న్యాయ‌మూర్తి ఈ వ్యాఖ్య‌లు చేశారు. జిల్లా కోర్టు విధించిన శిక్ష కూడా త‌గ్గించారు. దేశంలో మైన‌ర్ బాలిక‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై ఆందోళ‌న‌లు నెల‌కొంటున్న నేప‌ధ్యంలో పుష్ప చేసిన ఈ వ్యాఖ్య‌లు గంద‌ర‌గోళాన్ని సృష్టించాయి.

    పుష్ప ప్రతి తీర్పూ ఓ సంచలనమే..

    మహిళా న్యాయవాది పుష్ప గతంలో ఇచ్చిన తీర్పులు కూడా ఇప్పుడు ప్రముఖంగా తెరపైకి వస్తున్నాయి. గతంలో కూడా రేప్ కేసుల విషయంలో ఆమె ఇచ్చిన తీర్పులు వివాదాస్పదంగా ఉన్నాయి. జనవరి 15 మహారాష్ట్రలో జరిగిన ఓ రేప్ కేసులో తీర్పునిస్తూ.. నిందితుడి శిక్షను రద్దు చేసింది పుష్ప. కింది కోర్టు విధించిన పదేళ్ల జైలుశిక్షను పూర్తిగా రద్దు చేసింది. సురాజ్ అనే వ్యక్తి తాగి తన ఇంటికి వచ్చి రేప్ చేశాడని, తన నోరు గట్టిగా మూసేసి మాట్లాడనీయకుండా చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించింది. అయితే విచారణ జరిపిన తర్వాత అసలు రేప్ జరగడానికి అక్కడ అవకాశమే లేదని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. ఒక మనిషి, ఆడ మనిషిని నోరు మూసి అరవకుండా చేసి, బట్టలు విప్పేసి, అతను బట్టలు విప్పుకుని సెక్స్ చేయడం అసాధ్యం. పెనుగులాట లేకుండా అక్కడ రేప్ జరిగిందని నమ్మలేం. బాధితురాలి మెడికల్ రిపోర్ట్స్ లో కూడా గాయాలు లేవు, పెనుగులాడిన ఆనవాళ్లు లేవు. అందుకే రేప్ జరిగిందని నమ్మలేం అని తేల్చి చెప్పారు.

    ఇష్టపూర్వకంగానే ఇద్దరి మధ్య సెక్స్ జరిగిందని, ఆమె తల్లి అనుకోకుండా ఇంటికి రాగానే.. బాధితురాలు రేప్ అంటూ కట్టుకథ అల్లారని విచారణలో తేల్చారు. న్యాయమూర్తి పుష్ప ఇచ్చిన వాటిలో ఈ తీర్పు కూడా సంచలనమే.

    ఇంత‌కీ ఆ పుష్ప ఎవ‌రు ?

    మ‌హారాష్ట్రంలోని అమ‌రావ‌తి జిల్లాలో పుట్టిన పుష్ప న్యాయ‌శాస్త్రంలో గోల్డ్ మెడ‌ల్ సాధించారు. 2007లో నేరుగా జిల్లా జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. ముంబై సిటీ సివిల్ కోర్టు మ‌రియు నాగ్ పూర్ డిస్ట్రిక్ అండ్ ఫ్యామిలీ కోర్టు న్యాయ‌మూర్తిగా ప‌ని చేసింది. ఆ త‌ర్వాత నాగ్ పూర్ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జ‌డ్జిగా ప‌ని చేసి, ఆ త‌ర్వాత ముంబై హైకోర్టు రిజిస్ట్రార్ గా బ‌దిలీ అయ్యింది.

    2018లో ముంబై హైకోర్టు జ‌డ్జిగా నియామ‌క‌మైంది. అయితే సుప్రీంకోర్టు ఆమె నియామ‌కాన్ని నిలిపివేసింది. మ‌ళ్ళీ 2019లో ముంబై హైకోర్టు అడిష‌న‌ల్ జ‌డ్జిగా పోస్టింగ్ ఇచ్చారు. ఒక హ‌త్య కేసు విష‌యంలో ఉరిశిక్ష‌ను జీవిత‌ఖైదుగా మార్చిన బెంచ్ లో ఈమె కూడా ఒక‌రు. చాలా ద‌ఫాలు కోర్టుల్లో పెండింగ్ కేసుల విష‌యంలో బ‌హిరంగంగా త‌న అభిప్రాయాల‌ను వెలిబుచ్చారు. మ‌హారాష్ట్ర పోలీసుల విష‌యంలో కూడా వివిధ కేసుల గురించి గ‌ట్టిగా వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఇప్పుడు ఫోక్సో చ‌ట్టంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ఒక మ‌హిళా న్యాయ‌మూర్తిగా వివాదాస్ప‌దమ‌య్యారు.

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

     

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

     

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..