అపురూపంగా చూసుకున్న భార్య , వేరొకరితో అక్రమసంబంధం పెట్టుకుందన్న కారణంతో శాడిస్ట్ గా మారిన భర్త , సైకో కిల్లర్ గా మారాడు.. వారం రోజుల్లో ముగ్గురు మహిళలను చంపేశాడు., విశాఖ జిల్లా పెందుర్తి లో వరుస హత్యల కేసును చేదించిన పోలీసులకు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అనకపల్లి జిల్లా కోటవురట్ల కు చెందినసైకో కిల్లర్ రాంబాబు అరెస్టు చేసిన పోలీసులు , సీరియల్ హత్యల వెనుక కారణాలు తెలిపారు. 2018 లో రాంబాబు భార్య వేరోకరితో ఆక్రమ సంభందం పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు..అంతే కాక రియాల్ ఎస్టేట్ లో ఎజెంట్ గా పని చేస్తున్న సమయంలో యాజమాని చేతిలో మోసానికి గురయ్యాడు .
దీనినితో మహిళల మీద కక్ష పెంచుకున్నాడు . మహిళలను చంపడమే లక్ష్యం పెట్టకోని హత్యలు చేసాడు . మహిళలను చంపి వాళ్ళ మర్మాంగాలపై గాయాలు చేసేవాడు. కాళ్లతో తన్నేవాడు. రాంబాబు కు కూతురు (26) కొడుకు (27) ఉన్నారు ఇద్దరు తండ్రిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. వారం రోజుల్లో ముగ్గురు మహిళలను చంపిన రాంబాబు గతంలో చేసిన హత్యలపై పోలీసులు దృష్టి పెట్టారు.
విచారణలో మరిన్ని సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. గతంలో తను అద్దెకు ఉన్న ఇంట్లో క్షుద్ర పూజలు చేసేవాడు…దేవుడు వస్తున్నాడు అంటు పిచ్చి పిచ్చిగా కేకలు వేసేవాడని అందుకే అతన్ని ఇంటినుంచి ఖాళీ చేయించారని చెప్పారు. గతంలో హైద్రబాద్ రియాల్ ఏస్టేట్ లో పని చేసాడు…అంతే కాక ఆటో నడిపేవాడని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఎమైన ఉన్నాయా లేదా అనేది విచారణ చేస్తామని పోలీసులు చెప్పారు..