బట్టతలతో 107 పెళ్లిచూపులు పోయాడు.. చివరికి ఇలా చేశాడు..

    0
    1068

    బట్టతలతో 107 పెళ్లిచూపులు పోయాడు.. చివరికి ఇలా చేశాడు..

    అతడు మాత్రం ఏమి చేస్తాడు.. ? పెళ్ళిచూపులకి పోయినప్పుడల్లా , అంటా బాగుంది , అబ్బాయికి బట్టతలకదా ..? అమ్మాయి నచ్చడంలేదంటున్నారు.. ఒకటా , రెండా.. వందకు పైగా పెళ్ళిసంబంధాల్లో అమ్మాయిలు చెప్పిందిదే.. కొన్ని పేదింటి కుటుంబాల్లో ఎదురు కట్నం ఇస్తానన్నా అమ్మాయిలు నెత్తిమీద జుట్టులేని మొగుడు మాకొద్దన్నారు. అందుకే ఇక లాభం లేదనుకొని ఓ ట్రిక్ చేశాడు.. ఒక్క ఐడియా అతడి జీవితాన్ని మార్చినట్టే మార్చి మళ్ళీ నాశనం చేసింది. చెన్నై ఆలపాక్కంకు చెందిన రాజశేఖర్‌కు 27 ఏళ్ల యువతితో 2015లో వివాహమైంది. రాజశేఖర్‌కు బట్టతల కావడంతో విగ్‌ ధరించి పెళ్లి చూపులకు, వివాహానికి హాజరయ్యాడు. మేలైన సహజ వెంట్రుకలతో తయారుచేసిన విగ్‌ కావడంతో వధువు, ఆమె తరఫు బంధువులు గమనించలేదు. ఇంతకుముందు బట్టతలతో పెళ్ళిచూపులుకు పొతే , ఎదురు కట్నం ఇస్తానన్నా వద్దన్న వారు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా సినిమా హీరో స్టైల్లో అందమైన విగ్గుతో పోతే , అమ్మాయి తల్లితండ్రులు కట్న , కానుకలు ఇస్తామంటూ ముందుకొచ్చారు. 107 వ పెళ్ళిచూపుల్లో అమ్మాయి అందమైన క్రాఫ్‌తో హీరోలా ఉన్నాడని పెళ్లి చేసుకుంది. ఐదేళ్లు కాపురం చేసిన తరువాత అది విగ్‌ అని, భర్తది బట్టతల అని తెలుసుకుని అవాక్కైంది. తనకు అన్యాయం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విడ్డూరం చెన్నైలో చోటుచేసుకుంది. ఇటీవల తలపై విగ్‌ లేని సమయంలో భార్య గమనించి బిత్తరపోయింది. దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కట్నంగా ఇచ్చిన రూ.2 లక్షల నగదు, 50 సవర్ల బంగారు నగలను వాపసు చేయాలని డిమాండ్‌ చేయగా ఆమెపై భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త దాడి చేశారు. విగ్‌ పెట్టుకుని మోసగించిన భర్త రాజశేఖర్, అత్తింటి వారిపై చర్య తీసుకోవాలంటూ మంగళవారం బాధితురాలు చెన్నై తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటర్నెట్‌ వివాహ వేదికలోని వివరాలు చూసి మోసపోయానని ఆమె వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.