నమ్మకం లేని వ్యాక్సిన్లపై ఎన్ని లక్షల కోట్ల ఆదాయమో తెలుసా..?

    0
    327

     

    కరోనా వైరస్ వ్యాక్సిన్ పేరుతో కొత్త రకం మోసం, ఇదో కొత్తరకం వ్యాపారం. వ్యాక్సిన్ అంటే కొత్త అర్థం చెప్పిన మోసం. ప్రజల భయాలు, రాజకీయ అవసరాలను అడ్డం పెట్టుకుని వ్యాపార సంస్థలు అయోమయం సృష్టించి వ్యాక్సిన్ ను జనంలోకి వదిలేస్తున్నాయి. వ్యాక్సిన్ అంటే పోలియో, క్షయ, మీజిల్స్.. అలాంటి వ్యాక్సిన్ల మాదిరి ఒకసారి వేసుకుంటే, జీవితకాలం పనిచేసేవిగా ఉండాలి. ఇంతవరకు మనకు వ్యాక్సిన్లంటే ఒకసారి వేసుకుంటే జీవితకాలం పనిచేస్తాయని మాత్రమే తెలుసు. అయితే కొత్తగా వచ్చిన కరోనా వ్యాక్సిన్లు ఇన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయని కంపెనీలు మెల్లగా చెబుతున్నాయి. ఫైజర్ కంపెనీ తమ వ్యాక్సిన్ 85 రోజులు మాత్రమే పనిచేస్తుందని, ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రా జెనెకా టీకా మాత్రం తమ వ్యాక్సిన్ కొన్నేళ్లు పనిచేస్తుందని, అయితే ఎన్నేళ్లో చెప్పలేమని, మోడెర్నా టీకా రెండేళ్లు పనిచేస్తుందని చెబుతున్నాయి. అయితే దేనికీ ఎన్నేళ్లు పనిచేస్తుందనే విషయంలో గ్యారెంటీ లేదు. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ కూడా తమ వ్యాక్సిన్ రెండేళ్లే పనిచేస్తుందని చెబుతున్నారు.

    భారత్ తయారీ కొవాక్సిన్ కూడా ఆరు నెలలనుంచి ఏడాది పాటు పనిచేస్తుందని అంటున్నారు. ఇలా పనిచేస్తాయో లేవో తెలియని వ్యాక్సిన్లను అడ్డం పెట్టుకుని ఈ నాలుగు వ్యాక్సిన్ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా. అక్షరాలా ఒక లక్షా 86వేల కోట్ల రూపాయల వ్యాపారానికి గాలమేశాయి. దీనిలో అంతర్జాతీయ వ్యాపార సంస్థల లెక్కల ప్రకారం ట్యాక్స్ లు పోను 45శాతం లాభం. కరోనా వ్యాక్సిన్ మీద వచ్చినంత వివాదం, ప్రపంచ చరిత్రలో ఏ వ్యాక్సిన్ పై రాకపోవడం విశేషం.