ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా మారి చేసిన సినిమా 30రోజుల్లో ప్రేమించడం ఎలా..? కరోనా కారణంగా ఈ సినిమా విడుదల ఇన్నాళ్లూ వాయిదా పడింది. తీరా ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
నీలి నీలి ఆకాశం..
30రోజుల్లో ప్రేమించడం ఎలా.. ఈ పేరు కంటే నీలి నీలి ఆకాశం అనే పాట బాగా హైలెట్ అయింది. లాక్ డౌన్ టైమ్ లో ఈ పాట యూట్యూబ్ ని ఓ ఊపు ఊహింది. అంతే కాదు రికార్డుల మోత కూడా మోగించింది. సినిమా కంటే ముందు పాట పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాకు బాగా హైప్ వచ్చింది.
ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్ లో లింక్ షేర్ చేశాడు.
https://twitter.com/TheDeverakonda/status/1352220858442342401?s=20
నువ్వు వదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే అన్న హీరో డైలాగ్‌తో ట్రైలర్ మొదలయింది. ఇందులో ప్రదీప్ ఓవైపు గ్రామీణ యువకుడిగా కనిపిస్తూనే మరోవైపు కాలేజీ కుర్రాడిగా రెండు రకాల పాత్రలు చేశాడు. హీరోయిన్ అమృత అయ్యర్ తో ప్రదీప్ లిప్‌లాక్ కూడా లాగించేశాడు. హైపర్ ఆది, వైవా హర్ష, పోసాని కృష్ణ మురళీ వంటి కమెడియన్లు కూడా ఉండటంతో వినోదానికి ఏమాత్రం ఢోకా లేనట్లు కనిపిస్తోంది.