నాన్న విగ్రహమే సాక్షిగా ..

    0
    964

    కూతుళ్ళకు తండ్రిపై అపారమైన ప్రేమ అంటారు..కొడుకులున్నా తండ్రి మనసు కూతురువైపే లాగుతుంటుంది. అందుకే ఆ కూతురు తన వివాహం సమయానికి లేకుండాపోయిన , తండ్రి రూపాన్ని పక్కనే పెట్టుకుంది. తండ్రి విగ్రహం తయారుచేయించుకొని , వివాహ వేదికపై , తండ్రి విగ్రహం సాక్షిగా పెళ్లికొడుకుతో దండలు మార్చుకుంది.

    దీనివెనుక మరోఇద్దరు అక్కచెల్లెళ్ళు స్ఫూర్తిగా నిలిచి చెల్లెలి కోరిక ఇలా తీర్చారు. బెంగళూరులోని ఓ సంస్థ ద్వారా తండ్రి నిలువెత్తు సిలికాన్‌ విగ్రహాన్ని తయారు చేయించారు. రూ. 6 లక్షలు వెచ్చించి సిలికాన్‌తో 5 అడుగులు 7 అంగుళాల ఎత్తుతో రూపొందించిన విగ్రహాన్ని కల్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. దీంతో తండ్రి తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించినంత ఆనందంలో ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది. వధూవరులు ఇద్దరు ఆ విగ్రహం సమక్షంలో పూలమాలల్ని మార్చుకున్నారు. తమిళనాడు తంజావూరు జిల్లా పట్టుకోట్టైకు చెందిన సెల్వం పెద్ద పారిశ్రామిక వేత్త. ఆయనకు భార్య కళావతి, భువనేశ్వరి, దివ్య, లక్ష్మి ప్రభ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

    అల్లుళ్లుకూడా ముందునిలిచారు..

    తండ్రి అంటే కుమార్తెలకు ఎనలేని ప్రేమ. ఇందులో చిన్న కుమార్తె లక్ష్మీప్రభ ఆ తండ్రికి గారాల పట్టి. భువనేశ్వరి, దివ్యలకు ఎనిమిదేళ్ల క్రితమే అత్యంత వేడుకగా వివాహాన్ని జరిపించాడు. ఆనందంగా సాగుతున్న వారిపై విధి చిన్న చూపు చూసింది. 2012లో సెల్వం మరణించాడు. తండ్రి మరణం కుమార్తెల్ని కలచి వేసింది. ఈ పరిస్థితుల్లో తండ్రికి గారాల పట్టిగా ఉన్న లక్ష్మీప్రభ వివాహ రిసెప్షన్‌ సోమవారం రాత్రి పట్టుకోట్టైలోని ఓ వివాహ వేదికలో జరిగింది. ఈ వివాహంలో తండ్రి లేడన్న లోటు లక్ష్మీప్రభకు తెలియకూడదని అక్కయ్య భువనేశ్వరి, బావ కార్తిక్‌ భావించారు. ఇందుకోసం ఈ విగ్రహం తయారుచేయించారు.. తండ్రిపై తమ అనురాగాన్ని కూతుళ్లు ఇలా వ్యక్తంచేశారు.. అల్లుళ్లుకూడా ముందునిలిచారు..

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

     

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

     

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..