పెట్టిన తిండి గంటలో తింటే అప్పటికప్పుడే బులెట్ బైక్ మీ స్వంతమే..

    0
    2704

    బుల్లెట్ బైక్ కొనాలని ఉందా..? ఒక లక్ష 65 వేలు పెట్టి కొనలేరు..? మరెలా ?? వెరీ సింపుల్ ..పూణే లోని ఒక హోటల్ కి వెళ్ళండి. వాళ్ళు పెట్టిన తిండి గంటలో తింటే అప్పటికప్పుడే బులెట్ బైక్ మీ స్వంతమే.. కడుపునిండా తిని , బైక్ వేసుకొని వచ్చేయొచ్చు. కాకపోతే అది ఘటోత్కచుడి స్టయిల్ భోజనం.. ఇంతకీ మెనూ తెలియదు కదా ..చూసెయ్యండీ. పూణేలోని వడగల్ మావల్ ఏరియాలో ఉన్న హాటల్ పేరు శివరాజ్ హోటల్. గంటలో తినాల్సిన 4 కిలోల ఫుడ్ ఐటమ్స్ ఒకరికి 2500 రూపాయలు. మెనూలో 12 రకాల నాన్ వెజ్ ఐటెమ్స్ ఉంటాయి. చికెన్ , మటన్ , చేప , రొయ్య , పీతల పులుసు , వేపుళ్ళు, తండూరి రకాలతో పాటు , రొయ్యల బిరియాని పెడతారు. గంటలోగా తినలేకపోతే బులెట్ బైక్ గెలవలేరు. అయితే తినగలిగినంతసేపు సుష్టుగా తిని , కిళ్లీ వేసుకొని పోవచ్చు. గతంలోకూడా ఈ హోటల్లో 5 వేళా రూపాయలకు 8 కిలోల రావణ బొజనంపెట్టి , నలుగురు కలిసి గంటలోగా తింటే , 5 వేలరూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు..