వాడి శృంగార నీచ చరిత్రచూసి చెన్నై పోలీసులే భయపడిపోయే పరిస్థితి.

    0
    2505

    వాడి పేరు లవ్లీ గణేష్.. 21 ఏళ్లకే మహా ముదిరిపోయాడు. ఎంతగా అంటే వాడి శృంగార నీచ చరిత్రచూసి చెన్నై పోలీసులే భయపడిపోయే పరిస్థితి. సమాజంపై సోషల్ మీడియా దుష్ప్రభావానికి వీడొక నిదర్శనం. వాడిచేతిలో మోసపోయిన వారు ఇప్పుడు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు.బయటకు చెప్పుకోలేక కుమిలి పోతున్నారు. అమ్మాయిలను సోషల్ మీడియా ను అడ్డంపెట్టుకొని , లోబరుచుకోవడం , ఆ తరువాత పెళ్లి పేరుతొ తాళికట్టేయడం , రెండోరోజునుంచి లైంగికంగా హింసించడం ఇంత చిన్న వయసులోనే వాడికి వెన్నతోపెట్టిన విద్య, అమ్మాయిలతో శృంగార కలాపాలు వీడియో తీయడం , వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఇదీ వాడిపని. అమ్మాయిలముందే , మరో అమ్మాయిలతో శృంగారం చేయడం , ఒప్పుకుంటే ఇద్దరితో ఉండటం , వాటిని వీడియో తీయడం. విదేశీ పోర్న్ సినిమాల తరహాలో వాడు అమ్మాయిలను సెక్స్ చేయమని ఎంకరేజ్ చేస్తాడు. వీడి లైంగిక హింస భరించలేక , తాళి కట్టించుకున్న రెండుమూడు రోజులకే అమ్మాయిలు గుట్టుగా తెగతెంపులు చేసుకునేవాళ్ళు. అయితే వాళ్లతో తీయించుకున్న వీడియోలు చూపెట్టి బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇటీవల యధాప్రకారం 21ఏళ్ళ అమ్మాయికి ఇలాగే సోషల్ మీడియాలో వలవిసిరాడు. అమ్మాయిని పెళ్లిచేసుకొని ఇంటికి తీసుకొచ్చిన రోజే , మరో 17 ఏళ్ళ అమ్మాయినికూడా బెడ్ రూమ్ లో ఉంచుకున్నాడు. ఇద్దరితో శృంగారానికి సిద్దమయ్యాడు. ఎదురుతిరిగినందుకు అమ్మాయిపై దౌర్జన్యానికి దిగాడు. దీంతో వీడి కథ పోలీసులకు తెలిసి వాడి పాపం పండింది. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినా , వాడి పాపాల ఆనవాళ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. అమ్మాయిలు ఇప్పటికైనా బుద్దితెచ్చుకొని , సోషల్ మీడియా పరిచయాలకు దూరంగా ఉంటే మంచిది.. లేదంటే బతుకు కుక్కలు చింపిన విస్తరే..