నా కాపురంలో నిప్పులు పొయ్యొద్దు .. సనాఖాన్ ఏడుపు .

    0
    874

    పెళ్లితరువాత సినిమాలకు గుడ్ బై చూపిన హీరోయిన్ సనాఖాన్ ను ఇంకా గతం వెంటాడుతుంది . పెళ్ళికిముందు ఆమె ప్రేమ పురాణంపై ఇప్పుడు వస్తున్న వీడియోలతో ఆమె కలత చెందుతుంది . ఒక రకంగా కన్నీళ్లుపెట్టుకుంటూ , నా కాపురంలో నిప్పులు పోయవద్దంటూ వేడుకుంటుంది. పెళ్ళికిముందు ప్రముఖ కొరియో గ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో ఆమె చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. పెళ్లికూడా సెట్ అయిపొయింది. ఆ టైంలో ఇద్దరి ప్రేమయాత్రల వీడియోలను సనాఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలలో పెట్టుకుంది. ఇద్దరు రకరకాల భంగిమలలో తీయించుకున్న పోటోలను ఆమె పోస్ట్ చేసింది . ఈ ఫోటోలలో చాలావరకు అసభ్యంగా ఉండే ఫొటోలు కూడా ఉన్నాయి. ప్రేమయాత్ర సాగుతుండగా , సనాఖాన్ సడెన్ గా మెల్విన్ తో తెగతెంపులు చేసుకుంది. మెల్విన్ ఒక అమ్మాయితో ప్రేమాయణం సాగించి , కడుపు చేశాడని చెప్పింది. అడిగితే మెల్విన్ తల్లికూడా అదేమీ తప్పుకాదన్నట్టు మాట్లాడిందని చెప్పింది. తన దగ్గర డ్యాన్స్ నేర్చుకునే చాలామంది అమ్మాయిలతో మెల్విన్ అసభ్యంగా చాటింగ్ చేస్తుంటాడని కూడా చెప్పి అతడితో తెగతెంపులు చేసుకుంది. ఒక వ్యాపారవేత్తతో పెళ్లిచేసుకొని సెటిల్ అయిపొయింది. అయితే ఇప్పుడు ఆమె గతంలో తన ప్రేమ పురాణాలపై పోస్ట్ చేసిన వీడియోలు , ఫొటోలు సోషల్ మీడియాలో వస్తుండటంతో ఇది న్యాయమా ..? నా కాపురంలో నిప్పులుపోస్తారా ,అంటూ ఏడుస్తోంది. నేను వదిలేసిన నా గతంతో మీకెందుకు అంటూ అక్కసు వెళ్లగక్కింది.