భార్య ఇచ్చిన డోస్ ముందు.. వ్యాక్సిన్ డోస్ బలాదూర్…

  0
  911

  అనగనగా ఓ డాక్టర్. పేరు కె.కె. అగర్వాల్. దేశంలో పేరున్న గుండె వైద్య నిపుణులు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ పరిశోధకుడు కూడా. అలాంటి పేరున్న డాక్టర్ అగర్వాల్ భార్యకు చెప్పకుండా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ వెంటనే కారెక్కి ఫేస్ బుక్ లో లైవ్ ఇవ్వడం మొదలు పెట్టారు. వ్యాక్సిన్ ప్రయోజనాలు లైవ్ లో వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్నాక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, తానే దానికి ఉదాహరణ అంటూ హుషారుగా మాట్లాడారు. ఇంతలో భార్యనుంచి ఫోన్, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని. ఆయన ఏదో చెప్పబోయేలోగా.. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా, నాకెందుకు చెప్పలేదు, నన్నెందుకు తీసుకెళ్లలేదు అంటూ దబాయించేశారు. భార్య దబాయింపు కూడా లైవ్ లో రికార్డ్ కావడంతో ఇప్పుడీ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

  https://twitter.com/shukla_tarun/status/1354301166125912064?s=20

  నన్నెందుకు తీసుకెళ్లలేదు..

  కె.కె.అగర్వాల్ భార్య మీనా అగర్వాల్ ప్రముఖ గైనకాలజిస్ట్. 25ఏళ్లుగా ఆయన భర్తతో కలసి వైద్యరంగంలోనే ఉన్నారు. అయితే భర్త తనకు తెలియకుండా కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిసిన ఆవిడ.. వెంటనే ఫోనందుకుని చెడామడా వాయించేశారు. వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నారని కాదు, నాకు తెలియకుండా ఎందుకు వేయించుకున్నారు, అసలు నన్నెందుకు తీసుకెళ్లలేదని కాస్త గట్టిగానే వాయించారు.

  డాక్టర్ వివరణ వింటే నవ్వాగదు..

  ఫోన్లో భార్య వాయించిన విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడంతో కెకె అగర్వాల్ ఖంగుతిన్నారు. తన భార్యకు తనంటే ఎంతో ప్రేమ అని, అందుకే వ్యాక్సిన్ వేసుకుంటున్న సమయంలో ఆమె తనతోపాటు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఆమెకు వ్యాక్సినేషన్ వేయించనందుకు కాదు, వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తనని జాగ్రత్తగా చూసుకోడానికి ఆమెను పిలవలేదని ఫీలయ్యారని వివరణ ఇచ్చారు.

  https://twitter.com/DrKKAggarwal/status/1354408687956180997?s=20

  డాక్టర్ కతలు చాలానే ఉన్నాయి..

  డాక్టర్ కెకె అగర్వాల్ కి వైద్యరంగంలో మంచి పేరుంది. అయితే ఆయన లైవ్ లో చాలా తమాషాలు చేస్తుంటారని కూడా అంటారు. డాక్టర్లతో జరిగే వెబినార్లలో ఆయన చిత్ర విచిత్రమైన వేషాలతో కనపడేవారు. బార్బర్ షాప్ లో మసాజ్ చేయించుకుంటూనే ఆయన వెబినార్లలో పాల్గొన్న వీడియోలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

  గతంలో మోదీని ఎలా కవర్ చేశారంటే..

  కరోనా టైమ్ లో ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిముషాల సేపు దీపాలు వెలిగించండి అంటూ గతంలో మోదీ పిలుపునిచ్చారు. మోదీ 9నిమిషాల కాన్సెప్ట్ కి మన డాక్టర్ ఇచ్చిన వివరణ అప్పట్లో సెన్సేషన్ గా మారింది. మోదీని కవర్ చేయడానికి డాక్టర్ గారు బాగానే కష్టపడ్డారు. అయితే ఆ వివరణ విమర్శలపాలు కావడంతో వీడియోని సైతం డిలీట్ చేశారు.

  https://twitter.com/DilliDurAst/status/1354320480853848066?s=20

  భార్య చీవాట్లతో ఇప్పుడు డాక్టర్ కె.కె. అగర్వాల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. పద్మశ్రీ పురస్కారం వచ్చినప్పుడు కూడా రాని పబ్లిసిటీ భార్య ఫోన్ కాల్ తో ఆయన సొంతమైంది.