ప్రేమికుల రోజుపేరుతో వాట్సాప్ లో లింకుల దగా .. ఆశ , దోసె , అప్పడం..

    0
    260

    ఫిబ్ర‌వ‌రి 14… వాలెంటైన్స్ డే… ఈరోజు కోసం ఎంతోమంది ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. ఒక‌రికొక‌రు గిఫ్ట్ ఇచ్చుకుంటూ పార్టీలు చేసుకుంటూ సెల‌బ్రేట్ చేసుకుంటుంటారు. ఇందుకోసం హోట‌ల్స్, మాల్స్, ప‌బ్స్ ని ఎంచుకుంటుంటారు. ఇంకొంత‌మంది వెరైటీగా సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి ఉవ్విళ్ళూరుతుంటారు. వాలెంటైన్స్ డే రోజున ప్రేమికుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఆన్ లైన్ మోసాలు, ఫేక్ న్యూస్ లు కూడా స్మార్ట్ ఫోన్ల‌లో హ‌ల్చ‌ల్ చేస్తుంటాయి. అలాంటిదే ఇది కూడా.

     

    ప్రేమికుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఆన్ లైన్ మోసాలు,

    ప్రేమికుల దినోత్స‌వం సందర్భంగా తాజ్‌ హోటల్‌ మీకో బంపర్‌ ఆఫర్‌ ఇస్తోందంటూ యువ‌త‌ను ఓ మెసేజ్ ఆక‌ర్షిస్తోంది. దాని సారాంశం ఏమిటంటే… “జ‌స్ట్ ఇప్పుడే నేను తాజ్‌ గిఫ్ట్ కూప‌న్ గెల్చుకున్నాను. తద్వారా తాజ్‌ హోటల్‌లో 7 డేస్ ఫ్రీగా ఉండే ల‌క్కీ చాన్స్ వ‌చ్చింది.

    ట్రై యువ‌ర్ ల‌క్‌” అంటూ ఓ లింక్‌ కనిపిస్తోంది

    . ట్రై యువ‌ర్ ల‌క్‌” అంటూ ఓ లింక్‌ కనిపిస్తోంది. దీన్ని క్లిక్‌ చేయగానే ‘మీరు కరెక్ట్‌ గిఫ్ట్‌ బాక్స్‌ను ఎంపిక చేసుకుంటే తాజ్‌ హోటల్‌లో నివసించే ఛాన్స్‌ మీ సొంతం, గుడ్‌ లక్’‌ అని స్క్రీన్ మీద క‌నిపిస్తుంది. మళ్లీ ఓకే నొక్కగానే అక్కడ చిన్న ప్రశ్నలేవో అడుగుతుంది. వాటికి సమాధానం చెప్పిన వెంటనే స్క్రీన్‌ మీద పన్నెండు గిఫ్ట్‌ బాక్సులు ప్రత్యక్షమవుతాయి. వీటిలో ఏదైనా క్లిక్‌ చేసినప్పుడు గిఫ్ట్‌ కార్డు గెలుచుకున్నారే అనుకోండి. దాన్ని ఓ ఐదు వాట్సాప్‌ గ్రూపులకు లేదా 20 మందికి షేర్‌ చేయమని అడుగుతుంది. అవన్నీ పూర్తి చేశాక కథ మళ్లీ మొదటికి వస్తుంది. కాబట్టి ఇదో ఫేక్‌ మెసేజ్‌. ఈ వైరల్‌ మెసేజ్‌పై తాజ్‌ హోటల్‌ స్పందించింది. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ల‌వ‌ర్స్ కోసం తాము ఎలాంటి గిఫ్ట్ కూప‌న్లు ఇవ్వ‌డం లేదని క్లారిటీ ఇచ్చింది. కాబట్టి మీకు ఇలాంటి ఫేక్ మెసేజ్ లు వ‌స్తే న‌మ్మ‌కండి. మోస‌పోకండి.

    ఇదికూడా చదవండి..

    https://ndnnews.in/wife-sexwith-lover-infront-ofhusband/