జస్టిస్ ఎన్ వి రమణపై జగన్ ఆరోపణలు కొట్టివేశారు.

    0
    384

    అమరావతి భూముల వ్యవహారంలో కొంతమంది న్యాయమూర్తుల ప్రమేయంపై ఆరోపణలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న బాబ్డే, కాబోయే చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణను సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాసేముందు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రమేయం అమరావతి భూముల లావాదేవీల్లో ఉందంటూ జగన్ ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ చేశామని, అన్నీ పరిశీలించిన పిదప, ఆ ఫిర్యాదులను కొట్టివేస్తున్నామని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్గతంగా జరిగిన విచారణ అంతా రహస్యంగానే ఉంటుందని, దీన్ని బహిరంగంగా వెళ్లడించేందుకు వీలు లేదని కూడా స్పష్టం చేసింది. గత అక్టోబర్ 6న సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే కు, జస్టిస్ ఎన్వీరమణపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

     

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..