మానాభిమానాలు వదిలేసిన తారలు బోలెడుమంది.. వాళ్లలో శృతిహాసన్ కూడా ఒకటి.

    0
    1772

    కొంతమంది సినిమా తారలకు డ్రెస్సులు మార్చినంత సేపు కూడా పట్టదు , బాయ్ ఫ్రెండ్స్ , లేదా లవర్స్ ను మార్చడం. మూడు ,నాలుగేళ్లు సహజీవనంచేసి కూడా విద్రలేచేసరికి మరొకడితో కనిపిస్తారు. కొత్త లవర్ అంటూ ఘనంగా పరిచయంచేసేస్తారు. అంతే .. మళ్ళీ సహజీవనం .. సిగ్గు ,శరం , మానాభిమానాలు వదిలేసిన తారలు బోలెడుమంది.. వాళ్లలో శృతిహాసన్ కూడా ఒకటి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు . బాలీవుడ్ సినిమాలతోపాటు , దక్షిణాది సినిమాల్లోనూ హీరోయిన్ గా వెలిగిపోతొంది. తన 35 వ పుట్టిన రోజు సందర్భంగా కొత్త ప్రియుడిని పరిచయం చేసింది.. ఎయిర్ పోర్ట్ లో గట్టిగా కౌగలించుకొని , ఇతడే నా లేటెస్ట్ లవర్ , సహజీవనం చేయబోయే మంచోడు అంటూ చెప్పేసింది. ఇటాలియన్ నటుడు మైకేల్ కొరసాల్ తో కొన్నేళ్లపాటు తిరిగింది. సహజీవనం చేసింది. తన తండ్రితో సహా ఎంతోమందికి తన కాబోయే భర్త అని చెప్పుకుంది. ఇద్దరు కలిసి ఉన్న పోటోలను షేర్ చేసింది. ఏమైందో ఏమో.. ఇప్పుడు అతడిని వదిలేసి కొత్త లవర్ ని పట్టింది.. మళ్ళీ ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతొంది. పాత వాడి సంగతి ఏమిటని అడిగితే , గతంగురించి మాట్లాడటం మంచిదికాదని చెప్పింది. తన కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో సీక్రెట్ అంటూనే , తన పుట్టినరోజు కొత్త బాయ్ ఫ్రెండ్ తో కిస్ లు, హగ్ లు .. దీంతో అతడెవరో క్షణాల్లో తెలిసిపోయింది. అతడిపేరు సంతాను హజారికా .. అస్సామీ కలంకారీ ఆర్టిస్ట్. తన పుట్టిన రోజున , నువ్వు నా జీవితాన్ని నందనవనం చేయడానికొచ్చావు ..అంటూ శృతి పోస్ట్ పెట్టింది..