వచ్చే ఏడాదికి టోల్ ప్లాజాలు ఉండవు .

    0
    501

    మ‌రో ఏడాదిలోగా దేశంలో ఉండే అన్ని టోల్ ప్లాజాల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ఉప‌రిత‌ల ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్కారీ చెప్పారు. గురువారం లోక్ స‌భ‌లో టోల్ ప్లాజాల‌పై ఆయ‌న మాట్లాడుతూ టోల్ ప్లాజాల‌ను తొల‌గించి జీపీఎస్ ఆధారిత టోల్ క‌లెక్ష‌న్ల‌ను అమ‌లులోకి తీసుకొస్తామ‌న్నారు. టోల్ క‌లెక్ష‌న్లు జీపీఎస్ ద్వారానే జ‌రుగుతాయ‌న్నారు. వాహ‌నాల‌కు ఉండే జీపీఎస్ ఇమేజింగ్ సిస్ట‌మ్ ద్వారా ఒక నిర్దేశిత ప్రాంతాన్ని వాహ‌నం దాటిన‌ప్పుడు ఆటోమేటిక్ గా ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుము జ‌మ అవుతాయ‌న్నారు. 93 శాతం వాహ‌నాలు ఫాస్టాగ్ వినియోగిస్తున్నాయ‌ని, మిగిలిన 7 శాతం మాత్రం తీసుకోలేద‌న్నారు. ఇప్ప‌టికీ ఆ 7 శాతం వాహ‌నాలు రెట్టింపు టోల్ రుసుము క‌ట్టి వెళుతున్నాయ‌న్నారు. ఈ విష‌య‌మై పోలీసుల‌కు ఫిర్యాదు చేసి విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేస్తామ‌ని తెలిపారు. జీఎస్టీ ఎగ‌వేసేందుకు ఇలాంటి జిమ్మిక్కుల‌కు పాల్ప‌డుతుంటార‌ని చెప్పారు. ఫాస్టాగ్ గ‌డువును పెంచే ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టం చేశారు.

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..