కత్తి మహేష్ మృతిపై పోలీసు విచారణ..

    0
    402

    సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. కారు నడిపిన సురేష్ ను కోవూరు పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించారు. కొడవలూరు మండలంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించి అసలు ఆరోజు ఏం జరిగిందనే విషయాలను సేకరిస్తున్నారు. ఆసుపత్రిలో కూడా ఏమి జడిగిందనే విషయమై తమకు అనుమానాలున్నాయని మందకృష్ణ మాదిగ చెప్పిన విషయం తెలిసిందే.. కత్తి మహేష్ మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేప‌ధ్యంలో క‌త్తి మ‌హేష్ తో పాటు కారులో ఉన్న సురేష్ అనే వ్య‌క్తిని పోలీసులు విచారించారు. తాను డ్రైవ‌ర్ ని కాద‌ని, ఇద్ద‌రం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఓ ప్రాజెక్టు వ‌ర్క్ ప‌ని మీద వెళ్ళామ‌ని, ఆ ప్రాజెక్టులో తాను పార్ట‌న‌ర్ అని చెప్పాడు. అయితే ప్ర‌యాణంలో తాను సీటు బెల్టు పెట్టుకున్నాన‌ని, క‌త్తి మ‌హేస్ సీట్లు బెట్టు పెట్టుకోలేద‌ని తెలిపాడు. ఈ క్ర‌మంలో ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు తమ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయ‌ని, అయితే సీటు బెల్టు పెట్టుకోవ‌డం వ‌ల్ల తాను ప్ర‌మాదానికి గురి కాలేద‌ని తెలిపారు. క‌త్తి మ‌హేష్ సీటు బెల్టు పెట్టుకోక‌పోవ‌డంతో, ఆయ‌న త‌ల ట్ర‌క్కుకు బ‌లంగా త‌గిలింద‌ని, ఎయిర్ బ్యాగ్ కూడా ప‌గ‌లిపోయింద‌న్నాడు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న స‌మ‌యంలోనూ క‌త్తి మ‌హేష్ మాట్లాడుతున్నాడ‌ని చెప్పాడు. తాను ఏ విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డానికైనా సిద్ధంగా ఉన్నాన‌ని ఆయ‌న తెలిపారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.