శివుడిసేవలోనే తుది శ్వాస..

    0
    916

    ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్ర‌మైన హంపీలోని ప్రాచీన శివ‌లింగానికి గ‌త 42 ఏళ్ళుగా పూజ‌లు చేస్తోన్న కృష్ణ‌భ‌ట్ శివ‌సాన్నిధ్యం చేరుకున్నారు. మూడు మీట‌ర్ల ఎత్తున్న ఈ ప్రాచీన శివ‌లింగం మోకాళ్ళ లోతు నీళ్ళ‌ల్లో ఉంటుంది. వానొచ్చినా, వ‌ర‌దొచ్చినా కృష్ణ‌భ‌ట్ ఒక్క‌డే వెళ్ళి, ఆ శివ‌లింగానికి పూజ‌లు చేస్తుంటారు. అతి ప్రాచీన‌మైన ఈ మూడు మీట‌ర్ల శివ‌లింగానికి అకుంఠిత దీక్ష‌తో పూజ‌లు చేస్తున్న కృష్ణ‌భ‌ట్ భ‌క్తి, విశేష ప్రాచూర్యాన్ని పొందింది. భ‌క్తులు కూడా ఆయ‌నను శివ సేవ‌కుడిగా భావిస్తూ గౌర‌విస్తారు. ఆనిగొంది రాజ‌కుటుంబానికి చెందిన బ‌ద‌వీ శివ‌లింగ ఆల‌యంలో గ‌త 42 ఏళ్ళుగా ఒక్క‌రోజు కూడా ఆయ‌న పూజ‌లు చేయ‌డం మాన‌లేదు. శివ‌లింగం చుట్టూ ఉన్న నీరు ఏనాడు ఇంకి పోలేదు. ఆ నీరు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. అంత ఎత్తు శివ‌లింగానికి నిచ్చెన లేకుండానే శివ‌లింగం పీఠాన్ని ప‌ట్టుకుని వేలాడుతూ ఆయ‌న, ఆ శివ‌లింగానికి విబూధి రాసి, పూజ‌లు చేస్తుంటారు. భ‌క్త‌క‌న్న‌ప్ప శివ‌లింగంపై కాలుపెట్టి, క‌న్ను పెట్టిన‌ట్లు కృష్ణ‌భ‌ట్ కూడా ప్ర‌తిరోజూ మూడు మీట‌ర్ల ఎత్తున్న శివ‌లింగంపై కాలుమోపి ఎక్కుతాడు. కృష్ణ‌భ‌ట్ మ‌ర‌ణించే నాటికి ఆయ‌నకు 94 ఏళ్ళు. నిన్న కూడా ఆయ‌న శివ‌లింగానికి పూజ‌లు చేశారు. కాగా ఈరోజు కృష్ణ‌భ‌ట్ శివైక్యం పొందారు.

     

     

     

    వీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.