జయలలిత పాత్రకు ఏమాత్రం సరిపోని కంగన..

    0
    376

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జయలలిత బయోపిక్ తలైవి ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గానే ఈ ట్రైలర్ బయటకొచ్చినట్టు తెలుస్తోంది. జయలలిత జీవితం, ఆమె పోరాటం.. చివరకు విజయం.. ఇవన్నీ సినిమాలో పొందుపరిచనట్టు అర్థమవుతోంది. అంతా బాగనే ఉంది కానీ, జయలలిత పాత్రలో కంగనా రనౌత్ ని ఊహించుకోవడం మాత్రం కష్టంగా ఉంది. సినిమా నటిగా, రాజకీయ నాయకురాలిగా ఏ సందర్భంలోన కంగన జయలలితను గుర్తు చేయలేకపోయారు. కేవలం వస్త్రధారణలో మాత్రమే జయను గుర్తు చేసింది.

    తలైవి మూవీలో డైలాగులు మాత్రం బాగున్నాయి. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్‌ పాత్రధారి అరవిందస్వామి ఆహ్వానిస్తూ చెబుతున్న డైలాగ్‌ కథను మలుపుతిప్పే ఘట్టం. ‘మహా భారతంలో కూడా ద్రౌపదికి ఇదే జరిగింది. తన చీరను లాగి అవమానపరిచిన కౌరవుల కథ ముగించి, జడ ముడేసుకుని తన శపథాన్ని నేరవేర్చుకుంది. ఆ మహాభారతానికి ఇంకో పేరుంది..జయ’ అంటూ కంగనా చెబుతున్న ఆకట్టుకుంటోంది. కేఎల్‌ విజయ్ ఈ సినమాకు దర్శకుడు. జి.వి ప్రకాష్ సంగీతాన్నిచ్చాడు. ఏప్రిల్‌ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా తలైవి విడుదలవుతుంది. ప్రకాష్‌ రాజ్‌, అరవిందస్వామి, జిషు సేన్‌ గుప్తా కీలకపాత్రల్లో నటించారు.

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..