నిమ్మగడ్డ అనుకున్నది సాధించాడా..?

    0
    208

    మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు ప్రివిలేజ్ కమిటీ ద్వారా నోటీసులు పంపిన సందర్భంలో.. దానికి ప్రతిగా నిమ్మగడ్డ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గవర్నర్ తో తాను జరిపిన లేఖల వివరాలు బయటి వ్యక్తులకు లీకయ్యాయని, అసలా లీకుల సంగతి ముందు తేల్చాలని, సీబీఐ ఎంక్వయిరీ వేయాలని ఆయన హైకోర్టుని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. దీనికి సంబంధించి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

    ఇటీవల పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలను నిమ్మగడ్డ సవాల్ చేయగా.. ఆయనకు వ్యతిరేకంగా ప్రైవేటు వ్యక్తులు కోర్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలో వారు వేసిన పిటిషన్లకు జతగా నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్ మధ్య జరిగిన లేఖలను కూడా పొందు పరిచారు. దీనిపై నిమ్మగడ్డ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లేఖలు బయటకు రావడానికి కారణం ఎవరో కనిపెట్టాలని సీబీఐ ఎంక్వయిరీ వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిగింది.

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..