సోఫాలు మంచాలు ..ఇలా అన్నింటికి బంగారు రేకుతో తాపడం

    0
    667

    పాతకాలంలో చక్రవర్తుల రాజభవనాల గురించి వినడమేగానీ చూసిందిలేదు.. ఇల్లంతా బంగారం తాపడం అని చెప్తే వినడమే గానీ మనం చూసిందిలేదు.. కానీ ఇప్పుడో ఇల్లు లోపల అంతా బంగారుపూతతో తాపడం చేసింది అమ్మకానికి వచ్చింది.. కుర్చీలు, సోఫాలు ,డైనింగ్ టేబుల్స్ , మంచాలు ..ఇలా అన్నింటికి బంగారు రేకుతో తాపడం చేశారు.

    అన్నింటికీ బంగారు తాపడమే ..

    తలుపులు , కిటికీలు , ఫాల్స్ సీలింగ్ , స్టెయిర్ కేసు .. అన్నింటికీ బంగారు తాపడమే .. ఒక రకంగా రష్యా లో జార్ చక్రవర్తుల కాలంనాటి భవనాన్ని పోలిన ఈ ఇల్లు ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. రష్యాలో బైకాల్ సరస్సు ఒడ్డునే ఉన్న ఈ బిల్డింగ్ బయటి నుంచి చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తుంది గాని, ఈ భవంతి లోపలికి అడుగు పెడితే మాత్రం బంగారు ధగధగలు కళ్లు చెదిరేట్లు చేస్తాయి. ఏదో రాజప్రాసాదంలోకి అడుగుపెట్టినట్లే అనిపిస్తుంది.

    విలాసవంతమైన ఇంటి ధర కేవలం 21 కోట్లే..

     

    రష్యాలోని ఈర్‌కుత్‌స్క్‌ నగరంలో ఉన్న ఈ బంగారు భవనం ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. రెండెకరాల విస్తీర్ణమైన ప్రాంగణంలో పచ్చని తోటల మధ్య నిర్మించిన ఈ భవంతి విస్తీర్ణం 6,997 చదరపు అడుగులు. భవంతి మొత్తానికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యేకమైన విద్యుత్‌ సబ్‌స్టేషన్, వైన్‌ సెల్లార్, ఇంటి ఆవరణలో చక్కగా తీర్చిదిద్దిన పచ్చిక బయళ్లు, పైన్‌ వృక్షాలు, ఒక చేపల చెరువు, ఒక కృత్రిమ జలపాతం కూడా ఉన్నాయి. ఇంతకీ ఇంత విలాసవంతమైన ఇంటి ధర కేవలం 21 కోట్లే..

    ఇది కూడా చదవండి… https://ndnnews.in/121bulletbikeforbelletfood/