పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ లో ఇంకో ట్రెండ్.. ఇదికూడా పోలీస్ కానిస్టేబుల్స్ పరీక్షల్లో బయటపడింది.. ఎగ్జామ్ హాల్లోకి ఇప్పటివరకు , షూ , ఫుల్ హాండ్స్ షర్ట్ , కమ్మలు , దండలు , గాజులు , జడలో పిన్నులు , వాచీలు , మొబైల్ ఫోన్, హియరింగ్ ఎయిడ్స్ లాంటి వాటిని నిషేదించారు. ఎందుకంటే వీటిలో మైక్రో ఫోన్లు పెట్టుకొని కాపీచేస్తారని అనుమానంతో ఆలా చేశారు.. ఇప్పుడు ఏకంగా ఫేస్ మాస్క్ లోనే కాపీయింగ్ కోసం మనోడు బ్లూటూత్ లాంటి బుల్లి పరికరం ఏర్పాటు చేసుకున్నాడు.. దీనిలో సిమ్ కార్డు , మైక్రోఫోన్ , మైక్రో బ్యాటరీ ఉన్నాయి. వీడి తెలివి , దేశానికి కాకపోయినా ఇలాంటి దొంగ పనులకు ఉపయోగపడింది. అయితే వాడి టైం బాగాలేక చిక్కి జైలు కెళ్ళాడు..మహారాష్ట్ర చించివాడలో జరిగిందీ ఘటన..