వద్దన్న డ్రెస్సులే నేను వేసుకుంటా.

    0
    377

    చిరిగిన జీన్స్ , వళ్ళంతా కనపడే డ్రెస్సులు , తొడలు , మోకాళ్ళు కనపడే విధంగా ఉండే డ్రస్సులు వద్దంటూ ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్.చేసిన వ్యాఖ్యలపై అమితాబచ్చన్ మనవరాలు నవ్యనవేలి కస్సుమంది. మీరు వద్దన్న డ్రెస్సులే నేను వేసుకుంటా ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ తిట్టిపోసింది. ముందు మా డ్రస్సులు మారాలని మాట్లాడకుండా , మీ బుద్దులు మార్చుకోండి అంటూ సలహా చెప్పింది. యువత చిరిగిన జీన్స్ వేసుకుని, మోకాళ్లు చూపెడుతూ ఉంటే, లైంగిక వేధింపులు ఎందుకు ఆగుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్. ఇలాంటి వస్త్రధారణ సమాజానికి చెడు సంకేతాలు పంపుతుందని అన్నారు. దీనిపైనే ఆ అమ్మాయి ఇలా మాట్లాడింది. సరైన సంస్కృతి, పద్ధతుల్లో పెంచితే వారు ఎంత ఆధునికంగా వ్యవహరించినా జీవితంలో విఫలం కారని చెప్పారు. స్త్రీల హక్కులు, పిల్లల హక్కులు, ఇతర కారణాలతో పోరాటాలు చేసే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా చిరిగిన జీన్స్ ధరించడాన్ని తాను చూశానని, ఓ ఎన్జీఓ అధిపతిగా అలాంటి మహిళలు సమాజానికి ఎలాంటి సందేశాలు పంపుతున్నారని వ్యాఖ్యానించారు రావత్.

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..