బీహార్ లో నిన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఎలా కొడుతున్నారో చూడండి..
బీహార్ అసెంబ్లీలో పోలీస్ రిక్రూట్ మెంట్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా జరిగిన గొడవలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం మీడియా కెమెరాల్లో రికార్డ్ అయింది. విపక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలను మార్షల్స్ చితకబాదారు. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ ను ఘెరావ్ చేసేందుకు ప్రయత్నించగా మార్షల్స్ రంగంలోకి దిగారు. మహిళా ఎమ్మెల్యేలను సైతం బయటకు తోసేశారు. మార్షల్స్ వల్ల కూడా గొడవ అదుపులోకి రాకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఎమ్మెల్యేలను బయటకు నెట్టుకుంటూ వెళ్లారు.
What is happening in Bihar? Elected representatives from the opposition being treated like this in the Vidhan Sabha is highly condemnable and unacceptable https://t.co/EKy26vQJ3f
— Priyanka Chaturvedi (@priyankac19) March 23, 2021