చేతులు లేని చెల్లి కాలిబొటనవేలితో తిలకం.

    0
    198

    సోదరులేలేని ఓ అనాధ చెల్లికి చేతుల్లేవు.. కాళ్ళు మాత్రమే ఉన్నాయి. సోదరుడులాంటి ఓ వ్యక్తికీ తిలకం దిద్దాలనుకుంది. చెల్లి లాంటి ఆ తల్లిచేత తిలకం దిద్దించుకోవాలని అతడికీ ఆశ పుట్టింది.. అయితే ఆమెకు చేతులు లేవని తెలుసుకున్నాడు.ఆమె కాలి బొటనవేలితో నుదుట తిలకం దిద్దింది. అంతే అతడికి కన్నీళ్లు వచ్చాయి.. ఆ చెల్లి అసహాయస్థితికి , మరియు అలాంటి చెల్లి కాలి బొటనవేలు తన నుదిటిన తిలకం దిద్దినందుకు ..ఇంతకీ ఈ తిలకం దిద్దించుకున్న వ్యక్తి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్.. ఈ సంఘటనతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

    కన్నీటి పర్యంతం అయిపోయారు. ఇక నుంచి అన్నగా ఆమెకు తోడుంటానని భరోసా ఇచ్చారు. జలగావ్‌ నగరంలో వికలాంగుల కోసం దీపస్తంభ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ యువతి తిలకం దిద్దారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశంతో ఆయన కళ్లు చెమర్చాయి. ఈ సంఘటనపై ఆయన ట్విట్టర్ లో కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నా జీవితంలో ఎప్పుడూ లేనంత ఉద్వేగం, ఆనందం, బాధతో తల్లడిల్లిపోయాను.. ఆ చెల్లికిజీవితకాలం తోడుగా, నీడగా , అండగా ఉంటానని చెప్పారు.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here