జగన్ ,పవన్ ని అలా తిట్టడం వెనుక నిజం ఇదీ.

    0
    160

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోస్తాంధ్రలో చేస్తున్న వారాహి యాత్ర పాలకులను ఆలోచనలో పడవేసింది. ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కు విశేష ప్రజాధరణ లభించింది. ఆయన సభలకు జనం కూడా పోటెత్తి వచ్చారు. గతంలో ఎప్పుడూ లేనంతగా పవన్ కళ్యాణ్ సభలు ఇప్పుడు ఎందుకు విజయవంతం అవుతున్నాయి..? ఇంతమంది జనం ఎందుకు విరగబడుతున్నారు. ఇదీ ఇప్పుడు పాలకులను ఆలోచనలో పడవేసిన సమస్య.. పవన్ కళ్యాణ్ సభలకు పెద్దగా జనాన్ని కూడా సమీకరించింది లేదు. ఆయన ర్యాలీలకు సభలకు ఇంత భారీ సంఖ్యలో విశేష జన స్పందన లభించడంతో సహజంగానే పాలకుల్లో ఆలోచన మొదలైంది. అందువల్లనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కురుపాం సభలో పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన స్థాయిలోనే వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ సభల విజయవంతం అర్థం చేసుకోవచ్చు.

    సాధారణంగా ఎన్నికలకు ముందు మాత్రమే పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేసిన సీఎం జగన్ ఇటీవల కాలంలో అంతకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను తిట్టిపోస్తున్నారు. దీనికి కారణం కోస్తాంధ్ర జిల్లాల్లో ఆయన సభలకు ర్యాలీలకు వస్తున్న విశేషమైన ప్రజాధరణే.. గతంలో ఎన్నడూ లేనంతగా కాపు ఓట్లలో ఇప్పుడు చీలిక స్పష్టంగా కనిపిస్తోంది . గత ఎన్నికల్లో కాపుల్లో అత్యధిక శాతం వైసీపీ వైపే నిలబడ్డారు. అప్పట్లో వాళ్లు పవన్ కళ్యాణ్ ని కూడా నమ్మలేదు. అయితే ఇప్పుడు ఈ మార్పు ఎందుకు వచ్చింది అన్నది ప్రశ్న.

    పవన్ కళ్యాణ్ కు పోటీగా ముద్రగడ పద్మనాభం కార్డును తీసుకొచ్చినా ఎందుకో అది పని చేయలేదు. వాస్తవంగా ముద్రగడకు కాపుల్లో విశేషమైన పలుకుబడి ఉంది. ఆయన మాటే వేదంగా భావించే కాపులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఇటీవల ముద్రగడ విడుదల చేసిన రెండు లేఖాస్త్రాలు ఎదురు తిరిగాయి. దీంతో కాపులు ఎక్కువ సంఖ్యలో పవన్ కళ్యాణ్ వైపే నిలబడ్డారు అన్నది స్పష్టమైపోయింది . కోస్తాంధ్ర జిల్లాల్లో రాజకీయ సమీకరణలో ఎన్నికల గెలుపు ఓటమిలో కాపులది పెద్దన్న పాత్ర. అందువలన ఇప్పుడు వైసీపీ ఆలోచనలో పడింది. అసలు పవన్ కళ్యాణ్ సభలు విజయవంతం కావడం వెనక కారణం ఏమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.

    వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నవరత్నాలకు ప్రజల్లో ఆదరణ ఉంది. వీటికి లబ్ధిదారులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే గత ఎన్నికలనాటి, వైసిపి అనుకూల తటస్తులు, పరిపాలన, శాంతిభద్రతలు, అల్లకల్లోల పరిస్థితులు ,కేసులు, గొడవలు, విమర్శలు, తిట్లు, శాపనార్దాలు, అభివృద్ధి , మూడురాజధానుల రాద్ధాంతం , ఇటువంటి వాటితో కూడా విసిగిపోయి ఉన్నారు. మొత్తానికి గతంలో మాదిరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పక్కన తీసిపెట్టే పరిస్థితులు లేవు. ఆయనను నిర్లక్ష్యం చేసే అంత సీన్ కనిపించడం లేదు. ఎందుకంటే రాబోయే ఎన్నికలను కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఆయన విపరీతంగా ప్రభావితం చేస్తాడన్న నిజం ఆలస్యంగా నైనా తెలిసి వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ కూడా ఊహించని వాస్తవం. ఎన్నికలనాటికి రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

     

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here