నీ బట్టతల బంగారమా ..? ఎంత అదృష్టం.

    0
    622

    వామ్మో.. బంగారం స్మగ్లింగ్ లో ఇన్ని కళలా..? విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ కోసం స్మగ్లర్లు చిత్ర, విచిత్రమైన పద్ధతులు అవలంబిస్తున్నా అధికారులు ఎప్పటికప్పుడు పట్టేస్తున్నా, .మళ్లీ మరో మార్గంలో ప్రయత్నిస్తారు. చెన్నై ఎయిర్ పోర్టులో ఆరుగురు వ్యక్తులు విగ్గులు పెట్టుకొని బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. వారంతా సగం తల భాగం షేవ్ చేయించుకుని విగ్గు పెట్టుకున్నారు. విగ్గుకింద బంగారం పేస్ట్, విదేశీ కరెన్సీ దాచిపెట్టి తీసుకొచ్చారు. విమానం దిగిన తర్వాత వారి హెయిర్ స్టయిల్ చూసిన కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో , ఆరుగురు విగ్గురాయుళ్లను నిలదీస్తే మోసం బయటపడింది. గతంలో కూడా కేరళలో ఇదే రకమైన స్మగ్లింగ్ ట్రిక్ ప్రయోగించి స్మగ్లర్లు చిక్కిపోయారు. ఇప్పుడు ఓల్డ్ ట్రిక్కునే చెన్నైకి బంగారం స్మగ్లింగ్ లో వాడారు. గత మూడు రోజుల్లో దుబాయ్, షార్జా నుంచి ఇలా వచ్చిన మూడున్నర కిలోల బంగారం, 58 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..