డియర్ అనిల్ నువ్విచ్చిన ధైర్యమే ఇది..

  0
  790

  వైఎస్ఆర్ కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల.. ఈరోజు ఖమ్మంలో సంకల్ప సభ ఏర్పాటు చేశారు. ఈరోజే పార్టీపై ఆమె కీలక ప్రకటన చేయబోతున్నారు. ఉదయాన్నే భారీ ర్యాలీతో లోటస్ పాండ్ నుంచి ఆమె ఖమ్మం బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఆమె భర్త అనిల్ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. నీ జీవితంలో మొదలు పెట్టబోతున్న కొత్త అధ్యాయానికి ఇవే నా శుభాకాంక్షలు అని తెలిపారు అనిల్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు.

  అనిల్ ట్వీట్ కి అంతే భావోద్వేగంగా స్పందించారు షర్మిల. డియర్ అనిల్.. వైఎస్ఆర్ బాటలో నడిచేందుకు, నా ప్రయాణాన్ని మొదలు పెట్టబోతూ… ఒక్క క్షణం ఆగాను, ఇప్పటి వరకూ నా ప్రయాణంలో నువ్వు ఇచ్చిన మద్దతు, నాకు నువ్విచ్చిన ధైర్యం గుర్తుకొచ్చాయి. ఇది మనిద్దరికీ కొత్త ప్రారంభం. అని ట్వీట్ చేశారు.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ