లైవ్ లో సలహా అడిగితే చచ్చిపొమ్మని సలహా.

    0
    756

    యూట్యూబ్ లైవ్ లు, ఫేస్ బుక్ లైవ్ లు, ఇన్ స్టా లైవ్ లు.. ఇలాంటి లైవ్ చాట్స్ లో అమ్మాయిలు రకరకాలుగా లైవ్ స్ట్రీమ్ చేస్తుంటారు. అయితే చైనాలోని లోజియో అనే ఓ యూట్యూబర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 25ఏళ్ల ఈ యూట్యూబర్ తాను డిప్రెషన్లో ఉన్నానంటూ చైనీస్ యాప్ డోయిన్ లో స్ట్రీమింగ్ చేసింది. ఆమెకు 6లక్షల 78వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమెను చాలామంది డిప్రెషన్లో ఉంటే పురుగులమందు తాగి చచ్చిపో అంటూ రెచ్చగొట్టారు.

    మరికొంతమంది వెంటనే పోలీసుల్ని పిలవాలని ఆమె ఫ్రెండ్స్ కి సలహా ఇచ్చారు. అయితే ఈ సలహా ఇచ్చేవారిలో ఎక్కువమంది పురుగుల మందు తాగి చచ్చిపో, ఆత్మహత్య చేసుకో అని చెప్పడంతో ఆమె అందుబాటులో ఉన్న పురుగుల మందు తాగి లైవ్ స్ట్రీమింగ్ లోనే చనిపోయింది. మరో కథనం ప్రకారం ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని బెదిరించేందుకే లైవ్ స్ట్రీమింగ్ లోకి వచ్చిందని, చివరకు లైవ్ లో ఎక్కువమంది పురుగులమందు తాగి చనిపోవాలని చెప్పడంతో అదే మార్గం అనుసరించిందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె లైవ్ స్ట్రీమింగ్ వీడియో ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..