కరోనా నెగెటివ్.. అయినా ఊపిరి ఆగింది.

  0
  1385

  కరోనా భయంతో కరోనా లేకున్నా పోయే ప్రాణాలు ఎన్నో.. వాటిలో ఇతడి ప్రాణం కూడా ఒకటి. నిజామాబాద్ జిల్లా బొర్గం గ్రామానికి చెందిన అశోక్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా లక్షణాలుగా భావించిన తల్లి.. అశోక్ ను రెంజల్ మండల ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఆయనతో పాటూ భార్య లక్ష్మి, తమ్ముడు కూడా వచ్చారు. కరోనా పరీక్ష చేయించుకొని.. పక్కనే ఉన్న చెట్టుకింద కూర్చున్నాడు. మరికొద్దిసేపట్లో టెస్ట్ రిపోర్ట్ వస్తుందనగా.. తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ భయంతోనే ప్రాణాలు విడిచాడు. ఆ తరువాత అతడికి కరోనా నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అప్పటికే చెట్టు కింద కూర్చునే ప్రాణాలు విడిచాడు. తల్లి ఇంటికి వెళదాం రమ్మంటూ.. రోదిస్తున్న సన్నివేశం అక్కడ ఉండేవారిని కంటతడి పెట్టించింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.