మందు పార్టీకి పిలవలేదని ఆమె ఇచ్చిన ట్విస్ట్

    0
    99

    ఓ స్నేహితుల బృందం మందు పార్టీ చేసుకుంటూ మరో స్నేహితుడిని మందు పార్టీ కి పిలవకపోతే ఏమవుతుంది..? ఏమీ కాదు , వాడు అలిగి కూర్చుంటాడు , లేదా ఏడుస్తూ ఉంటాడు , లేదా కోపంతో తిట్టి పోస్తాడు , కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు , ఓ మహిళ తన కొలీగ్స్ తనను మందు పార్టీకి పిలవలేదని, ఈ విధంగా తనను అవమానించారని కేసు వేసి 74 లక్షల రూపాయలు నష్టపరిహారం గెలుచుకుంది. అదీ కేసు అంటే..

    రీటా లెహర్ అనే 51 ఏళ్ల మహిళ. తూర్పు లండన్ లోని స్ట్రాట్ ఫోర్డ్ లో ఒక కెసినో లో గత 20 ఏళ్లుగా పని చేస్తుంది . ఆమె క్యాసినో మేనేజర్ తర్వాత కోఆర్డినేటర్ గాను పని చేస్తోంది. అయితే తాను బ్రిటన్, ఆఫ్రికన్ మిశ్రమ జాతికి చెందిన మహిళనని తనను వేరుగా చూస్తున్నారని ఆరోపించింది . గత 20 ఏళ్లుగా తాను పని చేస్తున్నప్పటికీ తనకు ప్రమోషన్ ఇవ్వలేదని ,జీతాలు పెంచడంలో కూడా వివక్ష చూపిస్తున్నారని చెప్పింది . ఇటీవల కాసినోలో ఉద్యోగులు ఔటింగ్ కి పోవాలి అని నిర్ణయించుకున్నారు .

    ఈ సందర్భంగా అందరూ అవుటింగ్ కి పోతున్నా రీటా లెహర్ ని మాత్రం పిలవలేదు . దీంతో ఇది తనను మానసికంగా హింసించడం అని , అవమానించడమేనని , మందు పార్టీలో పార్టీలో తనకు అవకాశం కల్పించ లేకపోవడం అనేది జాతి వివక్షతకు వస్తుందని , ఇది దానికి బలమైన నిదర్శనమని ఆమె కేసు వేసింది. దాదాపు నాలుగేళ్ల పాటు జరిగిన ఈ కేసులో న్యాయమూర్తి చివరిగా తన తీర్పులో ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చారు.

    ఒకే ఆఫీసులో పనిచేసే వారంతా ఔటింగ్ కి పోతూ , ఒక్కరినే పిలవక పోవడం అంటే అది వివక్షత కిందికి వస్తుందని , అందువల్ల ఈ విషయంలో ఆమెకు యాజమాన్యం మరియు ఆమెను వదిలేసి వెళ్లిన ఉద్యోగులు అందరూ కలిసి 74 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు..

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..