అసలు రూపం దాచి , లక్షలు దోచింది..

  0
  891

  ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయి ఫోటో ప్టోఫైల్ పిక్ గా పెడుతుంది. డబ్బున్న యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతుంది. చాటింగ్ తో మొదలుపెట్టి చీటింగ్ తో ఎండ్ చేస్తుంది. అబ్బాయి తెలుసుకునేలోగా లక్షలు దోచేస్తుంది. తర్వాత మొబైల్ నంబర్ మార్చేస్తుంది. మళ్ళీ మరొకడికి ఎర వేసి , అదేరకం మోసం .. దగా . చివరకు అమ్మాయి పాపం పండి , పోలీసులకు చిక్కి జైలు పాలైంది. ఈమె పేరు మేఘ , హరిణి అనికూడా పేరు మార్చుకుంది. బెంగుళూరు సమీపంలోని ఆంద్రహళ్లిలో ఉంటోంది. ప్లస్ ఒన్ చదివింది. బిందు గౌడ, చిన్ను గౌడ అనేపేరుతో ఫేస్ బుక్ అకౌంట్ తెరిచింది. రవి అనే వ్యక్తికి ఏర వేసింది. అందమైన ఒక అమ్మాయి ఫోటోలను రవికి పంపింది.ఆ ఫొటో తనదేనని నమ్మించింది.

  చాటింగులో ఫోన్ నంబర్ తీసుకొని మాటలు కలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. మాకు మైసూరులో రెండు పెట్రోల్ బంకులు , బ్రాందీ షాపులు , బార్లు ఉన్నాయని నమ్మించింది. రవి ఆమె మాయలో పడిపోయాడు. పెళ్ళికి ఒప్పుకున్నాడు. వీ పుట్టిన రోజుకు ఫార్చునర్ కారు గిఫ్ట్ గా ఇస్తానంటూ చెప్పింది. కారు కొనుగోలుకు 40 లక్షలు రెడీగా ఉన్నాయని . 5 లక్షలు సర్దుబాటు చేయమంటూ మెస్సేజ్ పెట్టింది. వగలాడి మాయలో ఉన్న రవి , పాపం ఆగమేఘాలమీద డబ్బులు పంపేశాడు. మీ అమ్మ మెడలోని గొలుసు చాలా అందంగా ఉందని, తనకెంతో నచ్చిందని, దాన్ని తానుపంపే స్నేహితునికి ఇచ్చి పంపిస్తే అదేమాదిరి డిజైన్‌ను తయారు చేయించి తిరిగి ఇచ్చేస్తానని మభ్యపెట్టింది. దానికీ మోసపోయి , తల్లిమెడలో గొలుసు తీసి పంపేశాడు. ఇంతవరకు తానెవరో తెలియకుండా ఆమె జాగ్రత్త పడింది. ప్రేమ మాయ , ఫార్చునర్ కారు కలల్లో ఉన్న రవి , ఆమెను చూడకుండానే అడిగినవన్నీ పంపేశాడు. తర్వాత ఆమె మొబైల్ స్విచ్చాఫ్ అయింది. మోసపోయానని తెలుసుకొని పోలీసులవద్దకు పరుగులు తీసాడు. ఇదివరకే ఆమె మరో ఇద్దరినీ ఇలాగే లక్షల రూపాయలకు బురిడీ కొట్టించింది. 2018లో యోగానంద నుంచి రూ. 15 లక్షలు, శ్రీనివాస్‌ నుంచి రూ. 9.70 లక్షలను ఏమార్చి దోచుకున్నట్లు తేలింది. పోలీసులు ఆమెపై కేసుపెట్టి జైలుకు పంపారు.

  ఇవీ చదవండి

  క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..