భార్యలను ఇబ్బంది పెట్టొద్దు.. మందుకొట్టి నిద్రపోండి.

  0
  150

  ఛ‌త్తీస్ ఘ‌డ్ మ‌హిళా సంక్షేమ‌శాఖ మంత్రి అనీలా బేడియా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఓ గ్రామానికి వెళ్ళిన మ‌హిళా మంత్రికి స్థానిక మ‌హిళ‌లు త‌మ గోడును వెళ్ళ‌బోసుకున్నారు. త‌మ భ‌ర్త‌లు తాగొచ్చి గొడ‌వ చేస్తున్నార‌ని, ఈ బాధ‌లు త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని వాపోయారు. అందుకు స‌ద‌రు మ‌హిళా మంత్రి అనీలా … మీరు కూడా ఓ పెగ్ వేయండి అంటూ ఉచిత స‌ల‌హా ఇచ్చింది. ఇంట్లో ఆడ‌వాళ్ళు ప్ర‌శాంతంగా ఉండాలంటే ఓ స్మాల్ పెగ్ వేసుకుని నిద్రపోండి. మాన‌సిక ఒత్తిడి కూడా త‌గ్గుతుంది. రోజంతా ఇంటి ప‌నితో అల‌సిపోయి ఉండే మ‌హిళ‌ల‌కు… రాత్రి మందు తాగి వ‌చ్చే భ‌ర్త‌ల‌తో ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయ‌ని, ఇలాంటి త‌రుణంలో ఆడ‌వాళ్ళు కూడా ఓ పెగ్ వేసుకుని నిద్ర‌పోతే…. ఇలాంటి స‌మ‌స్య‌లు, ఒత్తిళ్ళ‌ను అధిగ‌మించ‌వ‌ద్ద‌ని చెప్పింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..