భార్య బాస్ గా ఉన్న ఆఫీసులోనే , భర్త స్వీపర్..

  0
  701

  కొన్ని సినిమాల్లో కధలు అప్పుడప్పుడు నిజాలవుతాయి.. అలాంటిదే ఇది.. భర్త స్వీపర్ గా ఉన్న ఆఫిసుకే భార్య బ్లాక్ డెవెలెప్మెంట్ ప్రెసిడెంట్ గా వచ్చింది.అంటే మన రాష్ట్రంలో మండలాధ్యక్షురాలు లాగా . ఇది కథ కాదు , కల కాదు.. నిజంగా జరిగిందే.. సునీల్ అనే వ్యక్తి యూపీలోని బలీయఖేరి బ్లాక్ డెవెలెప్ మెంట్ ఆఫీసులో స్వీపర్. ఆయన భార్య బిడిసి ఎన్నికల్లో బిజెపి తరపున ఒక వార్డు నుంచి పోటీ చేసి గెలిచింది. ఈ బ్లాక్ ప్రెసిడెంట్ పోస్టును ఎస్సీ వర్గాలకు కేటాయించారు. దీంతో స్వీపర్ సునీల్ భార్య సోనియాను ఈ పోస్టుకు పోటీ పెట్టారు. సునాయాసంగా గెలిచింది.. బ్లాక్ ప్రెసిడెంట్ అయిపొయింది.. తన భార్య బ్లాక్ ప్రెసిడెంట్ అయినా , తానుమాత్రం స్వీపర్ పోస్టులోనే ఉంటానని సునీల్ చెప్పాడు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.