తండ్రి కావాలని కలలు కన్న ఓ యువకుడి ఆశలపై భార్య నీళ్లు చల్లింది. తనకు వచ్చిన గర్భం నీవల్ల వచ్చింది కాదని, తన ప్రియుడి వల్లే వచ్చిందంటూ అతడి మొహానే చెప్పేసింది. దీంతో అవమాన భారం భరించలేక భర్త, ఆ భార్య, ఆమె ప్రియుడి వేధింపులు తాళలేక కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని మల్యాల్ మండలానికి చెందిన రాజుకు ఏడాది క్రితం రమ్య అనే యువతితో వివాహం అయింది. పెళ్లయిన తర్వాత రమ్యకు, ఇదివరకే రాజేంద్ర అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని, తెలిసొచ్చింది. పెళ్లయినా భర్తను లెక్క చేయకుండా ఆమె రాజేందర్ తో అక్రమ సంబంధం కొనసాగించింది.
ఎన్నిసార్లు మందలించినా పట్టించుకోకపోవడంతో రాజు కుమిలిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవల ఆమె నెల తప్పింది. తాను తన ప్రియుడి వలనే నెల తప్పానని అతడు ఇప్పుడు గర్భం వద్దంటున్నాడంటూ అబార్షన్ చేయించుకుంది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎంత చెప్పినా వినకపోవడం, భార్య, ఆమె ప్రియుడు ఇద్దరూ కలసి తనను మానసికంగా వేధించడంతో అవమాన భారంతో రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్వ పక్కనే రాజు మోటర్ సైకిల్, చెప్పులు కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. తన కొడుకు మరణానికి కోడలు, ఆమె ప్రియుడే కారణం అని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇవీ చదవండి
క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..
భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..
బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.
భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..